మరోసారి క్షీణించిన జి.డి.పి, తీవ్ర రిసెషన్ లో బ్రిటన్

వరుసగా మూడో క్వార్టర్ లో కూడా బ్రిటన్ స్ధూల దేశీయోత్పత్తి (జి.డి.పి) పడిపోయింది. గత సంవత్సరం చివరి క్వార్టర్ (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) లో ప్రారంభం అయిన బ్రిటన్ జి.డి.పి పతనం ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో కూడా కొనసాగడంతో బ్రిటన్ అధికారికంగా రిసెషన్ (మాంద్యం) లోకి జారుకున్నట్లయింది. ఈ పతనం వరుసగా ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో కొనసాగి మునుపటి కంటే ఎక్కువగా నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదు…

బ్రిటన్ పొదుపు విధానాలతో కుచించుకుపోయిన కుటుంబ బడ్జెట్లు

కొన్ని వందల బిలియన్ల పౌండ్లు అప్పు తెచ్చి బెయిలౌట్ల రూపంలో ప్రవేటు ద్రవ్య సంస్దలను మేపిన బ్రిటన్ ప్రభుత్వం తీరా ఆ అప్పులను తీర్చడానికి ప్రజల పైన భారం వేస్తూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మితవాద కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పెట్టుబడిదారీ అనుకూల పొదుపు విధానాల అమలు ప్రభావం బ్రిటిష్ పౌరుల కుటుంబ బడ్జెట్‌లను బాగా కుచించివేసిందని ‘ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిస్కల్ స్టడీస్’ చేసిన అధ్యయనంలో…