యూరప్ ముంగిట ఎమర్జింగ్ మార్కెట్ సంక్షోభం
ఋణ సంక్షోభంతో తీసుకుంటున్న ఐరోపా ప్రస్తుతం మరో సంక్షోభం ముంగిట నిలబడినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఋణ సంక్షోభంలో కూరుకుపోయిన యూరో జోన్ దేశాలు ఐ.ఎం.ఎఫ్ సహాయంతో బైటపడడానికి పాట్లు పడుతున్నాయి. కంపెనీల సంక్షోభాన్ని ప్రజల పైకి మరల్చడం ద్వారా సో-కాల్డ్ అభివృద్ధి చెందిన ఐరోపా ఆర్ధిక వ్యవస్ధలు ఋణ సంక్షోభం ద్వారా ఎదుర్కోవలసిన ఆర్ధిక మాంద్యాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలిగాయి. అయితే బ్రిక్స్, మింట్, ఫ్రగైల్ ఫైవ్ గా…