ఇటలీ ఒంటరి అయుండేది –ఇటలీ ప్రధాని

కేరళ జాలర్లను హత్య చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇటలీ మెరైన్లను ఇండియాకు పంపక పోయి ఉన్నట్లయితే అంతర్జాతీయంగా ఇటలీ ఒంటరి అయుండేది అని ఆ దేశ ప్రధాని మారియో మోంటి గురువారం వ్యాఖ్యానించాడు. మెరైన్లను వెనక్కి పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఇటలీ విదేశీ మంత్రి గిలియో టెర్జీ రాజీనామా చేయడంతో మారియో నాయకత్వం లోని తాత్కాలిక ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. న్యూ ఢిల్లీతో సంబంధాల విషయంలో తీవ్రమైన స్ధాయిలో…

బ్రిక్స్ పీఠంపై బాహాబాహి, జపాన్ వాకిట భిక్షాందేహి

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) సమావేశంలో సహచర ఎమర్జింగ్ దేశాలతో కలిసి “పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరిద్దాం, బహుళ ధృవ ప్రపంచాన్ని స్ధాపిద్దాం” అని పిలుపు ఇచ్చే భారత పాలకులు ధనిక దేశాల వద్ద దేహి అనడం మాత్రం మానడం లేదు. అలవాటు పడిన ప్రాణం ఏమో గాని, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టామని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకునే భారత ప్రభుత్వం రైల్వే సబ్ వేల నిర్మాణం పేరిట 2.32 బిలియన్ డాలర్ల…