నెమ్మదిగా పురోగమిస్తున్న బ్రిక్స్ బ్యాంక్

సెప్టెంబర్ 9, 2021 తేదీన భారత దేశం నేతృత్వంలో (Chairship) 13వ బ్రిక్స్ సమావేశాలు ఆన్-లైన్ పద్ధతిలో జరిగాయి. మిగతా నాలుగు దేశాల నేతలు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొని చర్చలు జరిపారు. “బ్రిక్స్ సభ్య దేశాల అంతర్గత సహకారం కొనసాగింపు, స్ధిరీకరణ, ఏకాభిప్రాయం” అనే అంశం కేంద్రంగా ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశం నాటికి బ్రిక్స్ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తవడం విశేషం. మూడు మూల స్తంభాల ప్రాతిపదికన బ్రిక్స్ దేశాల మధ్య సహకారం…

బ్రిక్స్ సమావేశాలు: నూతన అభివృద్ధి బ్యాంకు ఆవిర్భావం

జులై 16 తేదీన ముగిసిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశాల అనంతరం సభ్య దేశాధినేతలు చేసిన ప్రకటనతో ‘నూతన అభివృద్ధి బ్యాంకు’ (న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు) లాంఛనప్రాయంగా ఉనికిలోకి వచ్చింది. బ్యాంకుకు తుదిరూపు ఇస్తూ ఐదు వర్ధమాన దేశాల కూటమి బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) శిఖరాగ్ర సమావేశాలు బ్రెజిల్ నగరం ఫోర్టాలెజా లో ముగిశాయి. గత సంవత్సరం దక్షిణాఫ్రికా నగరం దర్బన్ లో జరిగిన సమావేశాలలో నిర్ణయించినట్లుగానే బ్రిక్స్ కూటమి…

ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు -బ్రిక్స్ పై ఈనాడు ఆర్టికల్

“ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు” శీర్షికన, “ఆశలు రేకెత్తిస్తున్న బ్రిక్స్ బ్యాంకు” ఉప శీర్షికన ఈనాడు ఎడిటోరియల్ పేజిలో ఈ రోజు ఈ బ్లాగర్ రాసిన ఆర్టికల్ ప్రచురించబడింది. ఎడిటోరియల్ పేజిలో ప్రచురితం కావడం ఈ బ్లాగర్ కి ఇదే మొదటిసారి. పత్రిక జతచేసిన బ్రిక్స్ దేశాధినేతల ఫొటో, బ్రిక్స్ సభ్య దేశాలతో భారత దేశ వాణిజ్యాన్ని వివరించె గ్రాఫు ఆర్టికల్ కు మరింత పరిపుష్టతను చేకూర్చాయి. ఈ సందర్భంగా ఈనాడు, మిత్రులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పడం…