బోస్టన్ పేలుళ్లు: నిందితులు ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారే

బోస్టన్ బాంబు పేలుళ్లకు బాధ్యులుగా అమెరికా ప్రకటించిన చెచెన్యా జాతీయులు అనేక సంవత్సరాలుగా ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారేనని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారు బాంబులు అభివృద్ధి చేసి సి.సి కెమెరాలు చూస్తుండగా వాటిని సంచుల్లో పెట్టుకుని బోస్టన్ మారధాన్ స్ధలానికి తెచ్చి ఎలా పేల్చగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలిద్దరిని కుట్ర చేసి ఇరికించారని తల్లిదండ్రులు ఆరోపించినట్లు రష్యా టుడే తెలియజేసింది. ఎఫ్.బి.ఐ గూఢచారులు ఎప్పుడూ తమ ఇంటికి వచ్చేవారని, తమ పిల్లల గురించి…

బోస్టన్ పేలుళ్ళ అనుమానితుల చిత్రం విడుదల, ఒకరి కాల్చివేత

బోస్టన్ మారధాన్ బాంబు పేలుళ్ళ కేసులో ఇద్దరు అనుమానితుల చిత్రాలు, వీడియోలను అమెరికా ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (ఎఫ్.బి.ఐ) విడుదల చేసింది. సి.సి కెమెరాలు రికార్డు చేసిన వీడియో నుండి ఇద్దరు అనుమానితులను ఎఫ్.బి.ఐ గుర్తించింది. వీడియో, చిత్రాలను విడుదల చేస్తూ వారి గురించి తెలిసినవారు సమాచారం ఇవ్వాలని ఎఫ్.బి.ఐ కోరింది. బాంబులు పెట్టిన వ్యక్తి నల్ల వ్యక్తి అని ‘న్యూయార్క్ పోస్ట్’, ‘బోస్టన్ టైమ్స్’ లాంటి పత్రికలు చేసిన ప్రచారం నిజం కాదని ఎఫ్.బి.ఐ…

బోస్టన్ బాంబు పేలుళ్లు -ఫోటోలు

అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయి. సెకన్ల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో ముగ్గురు చనిపోగా 130 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. 40 కి.మీ బోస్టన్ మారధాన్ పరుగు పందెం చివరి అంచెలో ఈ పేలుడు సంభవించింది. ప్రేక్షకులు నిలుచున్న చోట పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం ఏరియల్ వ్యూ నుండి తీసిన వీడియోను కింద చూడవచ్చు.   ఈ కింది ఫోటోలను ఆర్.టి (రష్యా…

అమెరికాలో బాంబు పేలుడు, ముగ్గురి మరణం

అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. సెకన్ల వ్యవధిలో రెండు బాంబులు పేలగా మరో 5 పేలని బాంబులు దొరికాయని పోలీసులు తెలిపారు. 40 కి.మీ దూరం సాగే ‘బోస్టన్ మారధాన్’ పోటీ ముగింపు స్ధలంలో జరిగిన ఈ పేలుళ్లలో ముగ్గురు మరణించారు. 130 మందికి పైగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో అవయవాలు తీసివేయాల్సి వచ్చిందని ఆసుపత్రుల అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి. బాల్ బేరింగ్ లాంటి ఇనప వస్తువులు కూరి బాంబులు తయారు…