అస్సాం మత హింసకు మోడీయే కారణం -ఒమర్

జమ్ము & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అస్సాం మతోన్మాద దాడులపై నోరు విప్పారు. ఎన్నికల సమయంలో మతోన్మాద దాడులు చెలరేగడానికి కారణం నరేంద్ర మోడియే అని ఆయన ఆరోపించారు. మూడు రోజుల క్రితం అస్సాంలో ఎన్నికల ప్రచారం చేసిన మోడి అస్సాంలో నివశిస్తున్న ముస్లింలు అందరూ విదేశీయులే అని స్ధానికులను రెచ్చగొట్టారని దాని ఫలితమే దాడులు జరిగి డజన్ల మంది మరణించారని ఆరోపించారు. “అస్సాంలో 30 మంది ముస్లింలను చంపేశారు. ఎందుకు? ఎందుకంటే బి.జె.పి ప్రధాన…