మొరేల్స్ మరియు ఆయన నైతిక ధృతి -ది హిందు ఎడిట్
(ఇవా మొరేల్స్ వరుసగా మూడో సారి బొలీవియా అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 60 శాతం ఓట్లు దక్కాయి. బొలీవియాలోని స్ధానిక ఆదిమ జాతుల సంతతికి చెందిన వ్యక్తి మొట్టమొదటిసారి అధ్యక్షుడు కావడం మొరేల్స్ సాధించిన ఘనత కాగా, వరుసగా మూడోసారి కూడా అధికారంలో కొనసాగడం మరో ఘనత. దేశ సంపదలను దేశ ప్రజలకే వినియోగపెట్టాలన్న సూత్రాన్ని కాస్త అటు ఇటుగా అమలు చేస్తున్న దేశాల్లో బొలీవియా ఒకటి. మొరేల్స్ విజయంపై ది హిందూ…