లేచి కలబడడం కాంగ్రెస్ నాయకులకి సాధ్యమా? -కార్టూన్

 “విన్నావా? నిలబడి కలబడదాం అని అంటున్నారామే”     “ఆత్మ రక్షణలో పడవలసిన అవసరం మనకేమీ లేదు. లేచి నిలబడి కలబడదాం. లక్ష్య శుద్ధితో దూకుడుగా పోరాడుదాం. బ్లాక్ మెయిల్ చెయ్యడం బి.జె.పి కి అలవాటుగా మారింది.” డీలా పడిన కాంగ్రెస్ నాయకులకు స్ధైర్యాన్నివ్వడం కోసం సోనియా గాంధీ అన్న మాటలివి.  బొగ్గు కుంభకోణం వల్ల కేంద్ర ఖజానాకి 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడి చేసిన దరిమిలా పార్లమెంటు సమావేశాలను వారం రోజులుగా…

బొగ్గు కుంభకోణం: ప్రధాని నోట ‘జీరో లాస్’ -కార్టూన్

2జి స్పెక్ట్రం కుంభకోణంలో అసలు నష్టమే లేదని చెప్పి ‘జీరో లాస్’ వాదనతో టెలికాం మంత్రి కపిల్ సిబాల్ అప్రతిష్టపాలయ్యాడు. ‘వొళ్ళు దగ్గర పెట్టుకోమం’టూ సుప్రీం కోర్టు చేత చీవాట్లు కూడా తిన్నాడు. సిబాల్ అనుభవం నుండి ప్రధాని పాఠాలు నేర్చుకోనట్లు కనిపిస్తున్నది. అత్యంత కనిష్ట స్ధాయిలో నష్టాన్ని అంచనా వేసినప్పటికీ 1,87,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చిందని చెప్పిన కాగ్ లెక్కలు వివాదాస్పదమని ప్రధాని వ్యాఖ్యానించాడు. ‘జీరో లాస్’ వాదనకు మద్దతుగా వివిధ అంశాలను…

నిష్కళంకుడి బండారం బట్టబయలు, 1.86 ల.కోట్ల బొగ్గు కుంభకోణానికి మన్మోహన్ సారధ్యం

నిష్కళంకుడుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే ప్రధాని మన్మోహన్ సింగ్ నిజ స్వరూపం ఏమిటో దేశానికి తెలిసి వచ్చింది. 1.86 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సారధ్యం వహించి ప్రజల వనరులను ప్రవేటు ముఠాలకు అప్పజెప్పిన మన్మోహన్ ‘మిస్టర్ అన్ క్లీన్’ గా అవతరించాడు. 2జి కుంభకోణం గురించి తనకు తెలియదని బుకాయించి తప్పించుకున్న ప్రధాని ‘బొగ్గు కుంభకోణం’ లో కన్నంలో వేలితో అడ్డంగా దొరికిపోయాడు. బొగ్గు గనులను వేలం వేయాలన్న ప్రతిపాదన 2004 లో…

మన్మోహన్ సచ్ఛీలుడనే అనుకున్నా, కానీ… … -అన్నా హజారే

“నేను పత్రాలు చూశాను. నాకు అనుమానం ఉంది. నాకూ అనుమానాలు వచ్చాయి. ఆయన పరిశుభ్రమైన ప్రధాన మంత్రి నేను ఎల్లప్పుడూ భావించాను. కానీ ఫైళ్ళు చదివాక… అక్కడ ఏదో తప్పు జరిగింది.” ఇవీ అన్నా హాజరే మాటలు. “ఆయన సామాన్యమైన వ్యక్తి” అని రెండు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ కి సర్టిఫికేట్ ఇచ్చిన అన్నా హజారే సోమవారం అన్న మాటలు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా, మన్మోహన్ ని సమర్ధిస్తూ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్నీ,…

ప్రధాని పై సి.బి.ఐ విచారణ వృధా -అన్నా బృందం

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంత్రిత్వంలో చోటు చేసుకున్న ‘బొగ్గు గనుల కుంభకోణం’ పై సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తే అది వృధా ప్రయాసేనని అన్నా బృందం కొట్టిపారేసింది. విచారణ సి.బి.ఐ కి అప్పగిస్తే ప్రధానికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం ఖాయమని పేర్కొంది. ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అయిన సి.బి.ఐ ప్రధాని పై విచారణ ఎలా చేస్తుందని ప్రశ్నించింది. కాంగ్రెస్ రాజకీయ మిత్రులయిన ములాయం, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ లపై సంవత్సరాల తరబడి విచారణ చేస్తున్నా…

విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోండి, ప్రధానితో అన్నా బృందం

ప్రధాని మన్మోహన్ సింగ్ అవినీతిపరుడు కాకపోతే తమ కంటే సంతోషించేవారు లేరనీ, అయితే ఆ సంగతి విచారణ జరిపించుకుని నిరుపించుకోవాల్సిందేనని అన్నా బృందం స్పష్టం చేసింది. స్వతంత్ర దర్యాప్తు జరిపించుకోవాలని అన్నా బృందం డిమాండ్ చేసింది. ప్రధానిపై అవినీతి ఆరోపణలు చేసింది తాము కాదనీ, రాజ్యాంగ సంస్ధ కాగ్ నివేదిక ద్వారానే తాము మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. “తనపై కేశినా ఆరోపణలు ఆధారహితమనీ, దురదృష్టకరమనీ, బాధ్యతారాహిత్యమనీ ప్రధాన మంత్రి అన్నారు. మేమాయనకి ఒక విషయం చెప్పదలిచాం. ఆరోపణలు…

మన్మోహన్, ప్రణబ్, ఇంకా 15 మంత్రుల అవినీతిపై విచారణ చేయాలి -టీం అన్నా

అన్నా బృందం బ్రహ్మాస్త్రం సంధించినట్లు కనిపిస్తోంది. సత్య సంధుడుగా యు.పి.ఏ ప్రభుత్వం చెప్పుకుంటున్న ‘ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అవినీతికి పాల్పడ్డాడని’ ఆరోపించింది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తో పాటు మరో 13 మంది కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టింది. బొగ్గు గనుల కేటాయింపులపై కాగ్ నివేదికను  ప్రధానిపై అవినీతి ఆరోపణలకు ఆధారంగా చూపింది. రిటైర్డ్ న్యాయమూర్తులతో ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటు చేసి విచారణ చేయాలని కోరింది. అన్నా బృందం ఆరోపణలను కాంగ్రెస్…

Coal scam-Wind fall gains

“బొగ్గు నష్టం” నివేదికపై చర్చలు ఇంకా పూర్తి కాలేదు -కాగ్

ప్రవేటు, ప్రభుత్వ కంపెనీలకు బొగ్గు గనులను చౌకగా కేటాయించడం వల్ల కేంద్ర ఖజానాకు రు. 10.67 లక్షల కోట్ల నష్టం వచ్చిందంటూ తాను తయారు చేసిన నివేదిక పై చర్చలు ఇంకా పూర్తి కాలేదని కాగ్ ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నది. చర్చలు పూర్తిగా కాక మునుపే, నివేదికను ఇంకా పూర్తి చేయక ముందే లీక్ కావడం తమను నిశ్చేష్టుల్ని చేసిందని కాగ్ తన లేఖలో తెలిపింది. తాను పేర్కొన్నంత నష్టం వాస్తవానికి సంభవించిందీ లేనిదీ…

రు. 10.67 లక్షల కోట్ల ‘బొగ్గు కుంభకోణం’ బట్టబయలు చేసిన సి.ఏ.జి

వేలం వేయకుండా ప్రవేట్, పబ్లిక్ కంపెనీలకు బొగ్గు గనులను అప్పనంగా కట్టబెట్టడం వలన కేంద్ర ప్రభుత్వ ఖజానాకి ఏకంగా 10.67 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని రాజ్యాంగ బద్ధ సంస్ధ ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఏ.జి) గురువారం వెల్లడించింది. విలువ రీత్యా 1.76 లక్షల కోట్ల 2 జి కుంభ కోణం కంటే ఇది ఆరు రెట్లు పెద్దది. 2004-2009 మధ్య కాలంలో 155 ఏకరేజ్ ల బొగ్గు గనులను వేల వేయకుండా 155 కంపెనీలకు…