యూరప్ ‘బెల్ట్ టైటెనింగ్’ -కార్టూన్

యూరో జోన్ దేశాలన్నీ ఖచ్చితమైన ఫిస్కల్ ఆర్ధిక విధానాలను కఠినంగా అమలు చేయాలని, తద్వారా మాత్రమే యూరోజోన్ సంక్షోభం సమసిపోతుందనీ జర్మనీ గత మూడేళ్లుగా వాదిస్తూ వస్తోంది. ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కొజీ తొ కలిసి కఠిన మైన పొదుపు ఆర్ధిక విధానాలను యూరో దేశాలపై వారు బలవంతంగా అమలు చేయడమే కాక తమ దేశాల ప్రజలపైన కూడా అమలు చేస్తున్నారు. కార్మికులు, ఉద్యోగులు ఇతర వృత్తులలో ఉన్న అనేక తరగతుల ఆదాయ మార్గాలన్నింటిపైన దాడి చేయడమే…

ఫ్రాన్స్ సహా 9 యూరో దేశాల రేటింగ్ కట్

యూరప్ రుణ సంక్షోభం కొనసాగుతోంది. యూరో జోన్ దేశాలు రుణ సంక్షోభం నుండి బైటికి వచ్చే సూచనలు సమీప భవిష్యత్తులో లేవని తొమ్మిది యూరో జోన్ దేశాల అప్పు రేటింగ్ ను తగ్గించడం ద్వారా ప్రముఖ రేటింగ్ సంస్ధ స్టాండర్ట్ & పూర్ (ఎస్ & పి) క్రెడిట్ రేటింగ్ సంస్ధ స్పష్టం చేసింది. యూరో జోన్ ఉనికి ప్రధానంగా ఆధారపడి ఉన్న దేశాల్లో ఒకటైన ఫ్రాన్సు రేటింగ్ సైతం ఎస్ & పి తగ్గించి సంక్షోభం…