ఇరాన్ అణుబాంబు నిర్మిస్తుందంటే నేన్నమ్మను -ఇజ్రాయెల్ కమాండర్

ఇరాన్ అణు బాంబు నిర్మిస్తుందని తాను భావించడం లేదని ఇజ్రాయెల్ ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ లెఫ్టినెంట్ జనరల్ బెన్నీ గాంట్జ్ కుండ బద్దలు కొట్టాడు. ఇరాన్ రహస్యంగా అణు బాంబులు నిర్మిస్తోందనీ, ఇరాన్ అణు బాంబులు ప్రపంచ శాంతికి ప్రమాదకరమనీ అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు ఓ పక్కన చెవి కోసిన మేకల్లా అరుస్తూ, ఇరాన్ పై అక్రమ యుద్ధానికి సైతం తెగబడుతున్న నేపధ్యంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మధ్య ప్రాచ్యం (Middle East)…