ఇజ్రాయెల్ సందర్శన: మోడి హయాంలో డీ-హైఫనేషన్ -2

ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాల చరిత్ర, పరిణామం ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాలు ప్రపంచ రాజకీయాలకు అతీతంగా ఎన్నడూ లేవు. ప్రపంచ భౌగోళిక ఆధిపత్య రాజకీయాలతో సంబంధం లేకుండా ఇరు దేశాల సంబంధాల గమనాన్ని అంచనా వేయడానికి పూనుకుంటే అది పాక్షిక పరిశీలనే కాదు; అవాస్తవ పరిశీలన కూడా. భారత పాలకులు స్వతంత్ర పాలకులు కాదు. వారు దళారీ పాలకులు. దళారీ వర్గం చేతుల్లో ఉన్న ఇండియా విదేశీ విధానం అనివార్యంగా అగ్రరాజ్యాల ప్రయోజనాలకు లొంగి ఉంటుంది తప్ప స్వతంత్రంగా ఉండలేదు. కనుక…

యుద్ధోన్మాద లికుడ్ విజయం, పాలస్తీనాకు శాంతి మృగ్యం

పాలస్తీనా ప్రజలకు శాంతి మరింత దూరం జరిగింది. వారి జాతీయ పోరాటం మరిన్ని కష్టాల పాలు కానున్నది. సొంత ఇంటికి తిరిగి వచ్చే 60 యేళ్ళ కలకు భంగం కలిగిస్తూ ఇజ్రాయెల్ ఎన్నికల్లో యుద్ధోన్మాద బెంజిమిన్ నెతన్యాహూ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆయన నేతృత్వం వహించే లికుడ్ పార్టీ ఇతర మితవాద, జాత్యహంకార పార్టీలను కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇరాన్, గాజాలపై అలుపు లేకుండా యుద్ధాలకు, ఏకపక్ష దాడులకు, యుద్ధ నేరాలకు, శాస్త్రవేత్తల…

ఇజ్రాయెలీల హత్యలకు బాధ్యులు హమాస్ కాదు ఇసిస్!

గాజా మరోసారి ఇజ్రాయెల్ జాత్యహంకార ముట్టడికి గురవుతోంది. ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల కిడ్నాప్ మరియు హత్యలను సాకుగా చూపుతూ గాజా పౌర నివాసాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా 200కు పైగా గాజా పౌరులు దుర్మరణం చెందగా ఉనికిలో ఉన్న కాసిన్ని ఇళ్ళు కూడా నేలమట్టం అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఏకపక్ష దాడిని హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ముద్ర వేయడంలో పశ్చిమ పత్రికలు శ్రమిస్తున్నాయి. కాగా శాంతి ప్రవచనాలు వల్లించడం వరకే ఐరాస పరిమితం…

కొత్త పరిణామం: మధ్యప్రాచ్యంలో చైనా రంగ ప్రవేశం?

అంతర్జాతీయ రంగంలో ఎంత మెల్లగానైనా బలాబలాల్లో మార్పులు వస్తున్నాయనడానికి తార్కాణంగా మరో పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉండే మధ్య ప్రాచ్యంలో చైనా రాజకీయ అరంగేట్రంకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బద్ధ శత్రువులైన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ ఇప్పుడు చైనా పర్యటనలో ఉండడం ఈ ఏర్పాట్లలో ఒక భాగంగా చూడవచ్చు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ రాజధాని బీజింగ్ లో విమానం దిగుతుండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చైనా వాణిజ్య…

ఇజ్రాయెల్: మితవాదం నుండి మధ్యేవాదం వైపుకు

జనవరి చివరి వారంలో జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. గాజా ప్రాంతం పైకి హంతక దాడులు చేసి 150 మందికి పైగా పాలస్తీనీయులను బలిగొనడం ద్వారా స్పష్టమైన మెజారిటీ సాధిస్తానని కలలు కన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆశలు నెరవేరకపోగా గణనీయమైన సంఖ్యలో సీట్లు కోల్పోవడంతో ఇజ్రాయెల్ రాజకీయాలు ఒక మాదిరి మలుపు తిరిగాయి. కొత్తగా ఏర్పడిన రెండు సెంట్రిస్టు పార్టీలు అనూహ్య రీతిలో 31 స్ధానాలు గెలుచుకోవడంతో నెతన్యాహు…