పశ్చిమ దేశాలు, రష్యాల తాజా ఘర్షణ కేంద్రం లిబియా -2

ఐరాస గుర్తించిన ప్రభుత్వం పేరు జాతీయామోద ప్రభుత్వం (గవర్న్ మెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్ -జి‌ఎన్‌ఏ). రాజధాని ట్రిపోలి ఈ ప్రభుత్వానికి అధికార కేంద్రం. ప్రస్తుతానికి పశ్చిమ దేశాలు అధికారికంగా ఈ ప్రభుత్వాన్నే గుర్తిస్తున్నాయి. అదే సమయంలో జనరల్ హఫ్తార్ నేతృత్వం లోని పోటీ ప్రభుత్వానికి కూడా అండదండలు ఇస్తున్నాయి. 20 మంది ఫ్రెంచి ప్రత్యేక బలగాలతో పాటు ఇటలీ, బ్రిటిష్, అమెరికా ప్రత్యేక బలగాల యూనిట్లు తోబ్రూక్ (హఫ్తార్) ఆర్మీతో కలిసి బెంఘాజీ నగర భద్రతలో…

లిబియా ఎంబసీపై దాడులు అమెరికాకి ముందే తెలుసు -ది ఇండిపెండెంట్

లిబియాలో అమెరికా రాయబారి హత్యకు దారి తీసిన ‘ఆల్-ఖైదా’ దాడుల గురించి అమెరికాకి ముందే తెలిసినా ఏమీ చేయలేదని బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ వెల్లడి చేసింది. సెప్టెంబరు 11, 2012 తేదీన లిబియా నగరం బెంఘాజీ లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్, మరో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందిన సంగతి విదితమే. అమెరికా మద్దతుతో లిబియాను పాలిస్తున్న ఆల్-ఖైదా గ్రూపుల్లోని ఒక గ్రూపు అమెరికా రాయబారి హత్యకు బాధ్యురాలు.…

9/11 వార్షికోత్సవ దినాన లిబియాలో అమెరికా రాయబారి హత్య

ఫొటో: ది హిందూ న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పై దాడులు జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన రోజునే లిబియాలో అమెరికా రాయబారి చావును రుచి చూశాడు. అమెరికా రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారుల్లోని ముస్లిం మత ఛాందస సలాఫిస్టు గ్రూపు కార్యకర్తలు ప్రయోగించిన రాకెట్ ప్రొపెల్లర్ గ్రేనేడ్ దాడిలో రాయబారి స్టీవెన్స్ దుర్మరణం చెందాడు. పాములకి పాలు పోసి పెంచే అమెరికా దుష్ట నీతికి స్టీవెన్స్ మరణం ఒక ప్రబల సాక్ష్యం. ఒక…