సి.ఐ.ఎ మాజీ బాస్ గర్ల్ ఫ్రెండ్ గుప్పెట్లో లిబియా దాడి రహస్యం

సి.ఐ.ఎ మాజీ బాస్ డేవిడ్ పెట్రాస్ రాజీనామాకి దారి తీసిన రాయబారి హత్య అమెరికా ఆధిపత్య వర్గాల రాజకీయాలను కుదిపేస్తున్నది. డేవిడ్ పెట్రాస్ గర్ల్ ఫ్రెండ్ పాలా బ్రాడ్వెల్ కంప్యూటర్ లో సి.ఐ.ఎ రహస్య పత్రాలు దొరికినట్లు బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్, అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు వెల్లడించడంతో సెక్స్ కుంభకోణం విస్తృతి అమెరికా పాలకవర్గాలకు దడ పుట్టిస్తోంది. డేవిడ్ పెట్రాస్ ఆఫ్ఘన్ యుద్ధ కమాండర్ పదవి నుండి తప్పుకుని సి.ఐ.ఎ బాధ్యతలు స్వీకరించాక ఆఫ్ఘన్…

సి.ఐ.ఎ బాస్ రాజీనామాకి అక్రమ సంబంధం కారణం కాదా?

సి.ఐ.ఎ బాస్ డేవిడ్ పెట్రాస్ నవంబర్ 10 (శుక్రవారం) న అకస్మాత్తుగా రాజీనామా చేశాడు. ఒక మహిళా విలేఖరితో ఆయనకి ప్రవేట్ అఫైర్ ఉన్న విషయం ఎఫ్.బి.ఐ విచారణలో బైటికి వచ్చిందనీ, అందువల్ల జాతీయ భద్రతకు ముప్పు వచ్చే పరిస్ధితిని తప్పించడానికి పెట్రాస్ రాజీనామా చేశాడని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాజీనామాను ఒబామా మరోమాటకు తావులేకుండా ఆమోదముద్ర వేసేశాడు. యుద్ధాల్లో పెట్రాస్ సేవలను కార్పొరేట్ పత్రికలు ఒకపక్క కొనియాడుతూనే ఆయన చేసిన పిచ్చిపని క్షమార్హం కాదని…