కన్నడం మాట్లాళ్లేదని ఈశాన్యీయులను చావబాదారు

పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా భారత దేశంలో జాతి విద్వేషం (రేసిజం) లేదని గర్వంగా చెబుతుంటారు. (తద్వారా జాతి విద్వేషాన్ని తలదన్నే కులవివక్ష ఉనికిని నిరాకరిస్తారు.) ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షతో పాటు భాషా వివక్ష కూడా అమలు చేయవచ్చని బెంగుళూరులోని ముగ్గురు భాషా పరిరక్షకులు చాటారు. తద్వారా జాతి వివక్షలోని ఒక వింత రూపాన్ని ఆవిష్కరించారు. మంగళవారం రాత్రి బెంగుళూరులోని ఒక హోటల్ లో జరిగిందీ ఘటన. బెంగుళూరు (నార్త్-ఈస్ట్) డి.సి.పి వికాస్ కుమార్ ప్రకారం…

మొండి వినికిడి సమస్యా? ఐతే బసవనగుడికి రండి!

బసవన గుడి అంటే దేవుడి గుడి కాదు. బెంగుళూరులో అదొక ఏరియా. ఈ ఏరియాలో అద్భుతమైన చెవి (ENT) డాక్టర్ ఉన్నారు. ఈ టపాని ఇప్పుడు ఆయన ఆసుపత్రిలోని ఓ రూమ్ నుండే రాస్తున్నాను. పెద్దగా ప్రచార పటాటోపం జోలికి పోని డాక్టర్ మహదేవయ్య ఈ ఆసుపత్రిలో ప్రధాన డాక్టర్. చాలా పెద్దాయన. నాకు చిన్నప్పటి నుండి చెవి సమస్య ఉంది. గత పాతికేళ్ళ నుండి వినికిడి సమస్య కూడా ఉంది. ఈ పాతికేళ్లలో ఒకే స్ధాయిలో…

44 మందిని మసి చేసిన దారుణ బస్సు ప్రమాదం

బుధవారం తెల్లవారు ఝామున ఘోరమైన రోడ్డు ప్రమాదం సభవించింది. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు ఒకటి డివైడర్ ని ఢీకొట్టి ఉన్నపళంగా అగ్నికి ఆహుతయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఏం జరిగిందో తెలుసుకుని తప్పించుకునే లోపు బస్సు నిండా దట్టమైన పొగలు అల్లుకుపోవడంతో ఎటు పోవాలో తెలియక మంటల్లో మాడి మసై పోయారు. రిజర్వేషన్ బుకింగ్ జాబితా తప్ప ప్రయాణీకులను గుర్తించడానికి మరే మార్గమూ లేకుండా పోయింది. డ్రైవర్, క్లీనర్ తో సహా…

కూతురిని నాలుగేళ్ళు హౌస్ అరెస్ట్ చేసిన తల్లిదండ్రులు?

కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రధానంగా ఆడపిల్లదేనా? ‘వాడికేం మగాడు’ అనే సమాజం తల్లిదండ్రుల చేత తన కూతుళ్లపైన ఎంతటి ఘోరకలికయినా తెగించేట్లు చేస్తుందా? ఆడపిల్లలకు ఇష్టమైనవారిని ఇచ్చి పెళ్లి చేసే విషయంలో కొందరు తల్లిదండ్రులు ఎంత క్రూరంగా వ్యవహరించగలరో బెంగుళూరులోని ఈ హృదయ విదారక సంఘటన చెబుతోంది. తమకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు 31 యేళ్ళ (ఇప్పుడు 35) తమ కూతురిని నాలుగేళ్లుగా గదిలో బంధించి ఉంచిన తల్లి దండ్రులను ఎలా అర్ధం…

యాక్సిడెంట్ బాధిత ఈశాన్య మహిళపై చేయి చేసుకున్న వీర పోలీసు

టూ వీలర్ తో కారుని గుద్దిన వ్యక్తిని వదిలి కారు నడుపుతున్న మణిపురి మహిళ (పేరు: Swar Thounaojam) పై చేయిచేసుకున్న వీర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదంతం ఇది. ప్రమాదం చేసిన వ్యక్తిని వదిలిపెట్టి మొదటి తప్పు చేసిన కానిస్టేబుల్ మహిళపై చేయిచేసుకుని మరో నేరానికి పాల్పడ్డాడు. ప్రమాదస్ధలి వద్ద గుమికూడిన జనం కూడా మహిళనే తిట్టి, కొట్టినంతపనిచేసి, అసభ్యంగా తాకరానిచోట్ల తాకి భారత సమాజ నాగరికత యొక్క సగటు సభ్యత పాతాళస్ధాయిలోనే కునుకు తీస్తోందని చాటుకున్నారు.…

‘ఆధునికత’ ముసుగులో మెట్రోల్లో కొనసాగుతున్న కుల, మత వివక్షలు -ది హిందూ

భారత దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజ్ఞానానికి రాజధానిగా భాసిల్లుతున్న బెంగుళూరు లో కుల, మతాల మూఢత్వం ‘ఆధునికత’ ముసుగులో పరిఢవిల్లుతోందని ‘ది హిందూ’ వెల్లడించింది. సామాజిక వ్యవస్ధల్లో మనుషుల మధ్య తీవ్ర వైరుధ్యాలకు కారణంగా నిలిచిన కుల, మతాలు కాల క్రమేణా బలహీనపడుతున్నాయన్న విశ్లేషణల్లో నిజం లేదని ‘ది హిందూ’ పత్రిక ప్రచురిస్తున్న పరిశోధనాత్మక కధనాల ద్వారా తెలుస్తోంది. భూస్వామ్య వ్యవస్ధ మూలాలయిన కులం, మత విద్వేషాలు ఆధునికతకు మారుపేరుగా భావించే మెట్రో నగరాల్లో బలహీనపడకపోగా యధాశక్తితో…