కన్హయ్యతో మమతను పెళ్లగించగలరా? -కార్టూన్
“కన్హైయా కుమార్ ఎన్నికల ప్రచారంలో సిపిఐ, సిపిఎం పార్టీల తరపున పాల్గొంటారు” అని ఇరు పార్టీలు పుత్రోత్సాహంతో ప్రకటించేశాయి. తద్వారా జేఎన్‌యూ విద్యార్ధుల పోరాటాన్ని తీసుకెళ్లి పార్లమెంటు/అసెంబ్లీ ఎన్నికల రొంపిలోకి దింపి స్వప్రయోజనాలకు వినియోగించడానికి ఆ పార్టీలు తలపెట్టాయి. సిపిఎం నేత సీతారాం యేచూరి, సిపిఐ నేత డి రాజాలు ఇద్దరూ ఈ మేరకు టివి ఛానెళ్లలో కనపడి ప్రకటన చేశారు. కన్హైయా బెయిల్ పై విధించబడ్డ షరతుల రీత్యా ఆయన కేరళ, బెంగాల్ కు ప్రయాణించబోరని…