బూతు బొమ్మలు, మత సంస్ధలు

(గమనిక: గురు గోల్వాల్కర్ వ్యక్తం చేసిన భావాలపైన నేను రాసిన పోస్టుకి ఇది మిత్రుడు ప్రవీణ్ రాసిన వ్యాఖ్య. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించబడినందున పోస్టుగా మలిచాను. చర్చలో పాల్గొనవలసిందిగా ఇతర మిత్రులను ఆహ్వానిస్తున్నాను. ఎం.ఎఫ్.హుస్సేన్ బొమ్మలని కేవలం బూతు బొమ్మలుగానూ, ఆడవాళ్ళని చెత్తగా చూపించడంగానూ ప్రవీణ్ పేర్కొన్నాడు. కళాకారులు చాలామంది అలా భావించరు. అలాగే మత విశ్వాసాలు గాయపడ్డాయని భావించబడినప్పుడు వివిధ మతస్ధులలో వచ్చిన ప్రతిస్పందనలలో తేడాలను ప్రవీణ్ ప్రస్తావించాడు. ఈ తేడాల ద్వారా…