ఎన్ కౌంటర్లు ఎందుకు చట్టవిరుద్ధం?

‘నిన్ను ఎన్ కౌంటర్ చేసేస్తా’ ఇది పోలీసు సినిమాల్లో తరచుగా వినపడే పదం. ఎన్ కౌంటర్ చేయడాన్ని వీరోచితకార్యంగా సినిమాలు వాడుకలోకి తెచ్చాయి. ‘ఎన్ కౌంటర్ స్పెషలిస్టు’ అనే బిరుదు కొందరు పోలీసులకు పత్రికలు తగిలించడం మొదలై చాలాకాలమే అయింది. వీటన్నింటి మూలంగా ఎన్ కౌంటర్ చెయ్యడం పోలీసుల విధి, కర్తవ్యం, బాధ్యత… ఇత్యాదిలాగా పరిస్ధితి తయారయింది. ఆంద్ర ప్రదేశ్ మాత్రమే కాదు, దాదాపు పోలీసులు, సైన్యంలకు ఆధిపత్యం అప్పగించి పాలన సాగించే ప్రతి చోటా ఈ…

చట్టాల అమలులో హింసా ప్రయోగం -ది హిందు ఎడిట్..

[Violence in law enforcement శీర్షికన ఈ రోజు (ఏప్రిల్ 8) ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] ఆంద్ర ప్రదేశ్ కు చెందిన యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది 20 మంది చెక్కకోత పనివాళ్లను -ఎర్ర చందనం స్మగ్లింగ్ మాఫియాతో సంబంధం ఉందని భావిస్తూ- చంపివేయడం వల్ల పోలీసుల జవాబుదారీతనం పట్లా, అసమతుల్య బలప్రయోగం పట్లా వ్యాకులపూరితమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెక్కకోత పనివాళ్లను లొంగి పొమ్మని టాస్క్ ఫోర్స్ బలగాలు…

మణిపూర్ ఎన్ కౌంటర్లు బూటకం, సుప్రీం కోర్టు కమిటీ నిర్ధారణ

మణిపూర్ లో భారత సైనికులు పాల్పడిన ఆరు ఎన్ కౌంటర్లు బూటకం అని సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. 12 సంవత్సరాల బాలుడితో సహా ఎన్ కౌటర్ లో మరణించినవారందరికీ ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదని కమిటీ తేల్చి చెప్పింది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ లతో కూడిన డివిజన్ బెంచి కమిటీ నివేదికను పరిశీలించింది. కమిటీ ఆరు ఎన్ కౌంటర్ కేసులను విచారించగా, ఆరు కేసులూ…

పోలీసులు చంపిన 23 మందీ గిరిజనులే, నక్సలైట్లు కాదు -పత్రికలు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బసగూడ వద్ద సి.ఆర్.పి.ఎఫ్ జరిపిన ఎన్ కౌంటర్ లో చనిపోయినవారంతా అమాయక గిరిజనులేనని వారిలో ఎవరూ నక్సలైట్లు లేరనీ పత్రికలు, చానెళ్ళు వెల్లడి చేశాయి. చనిపోయినవారిలో ఎవరూ మావోయిస్టులు లేరని మావోయిస్టు నాయకుడు ఉసెండి తమ కార్యాలాయానికి ప్రకటన పంపినట్లు ఎ.బి.ఎన్ టి.వి చానెల్ తెలియజేయగా, చనిపోయినవారిలో ఎక్కువమంది గిరిజనులే అయి ఉండవచ్చని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. చనిపోయినవారిలో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారనీ బాలికలను…

‘ఇష్రత్ జహాన్’ ఎన్‌కౌంటర్ పచ్చి బూటకం, నరేంద్ర మోడికి మరో లెంపకాయ

నరేంద్ర మోడి హయాంలో గుజరాత్ పోలీసులు సాగించిన బూటకపు ఎన్‌కౌంటర్ ల గుట్టుమట్లు ఒక్కొక్కటీ వెల్లడవుతున్నాయి. నిప్పులాంటి నిజాలు తమను ఆవహించిన నివురుని చీల్చుకుని బైటికి వస్తున్నాయి. గుజరాత్ హైకోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) పందొమ్మిదేళ్ళ విద్యార్ధినితో పాటు మరొక ముగ్గురు యువకులను ఉత్తి పుణ్యానికి కాల్చిచంపి ఎన్ కౌంటర్ గా కధ అల్లిన ఘటనపైన విచారణ జరిపి నిజా నిజాలను వెల్లడించింది. పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఇష్రత్ జహాన్, జావేద్ షేక్ అలియాస్…