అసహనంపై రువ్విన అస్త్రం ‘బుక్కెడు బువ్వ’ కధ!

” సోదరులారా…మనది ఎంతో సంపన్న దేశం….” ” మూడురోజులైంది బాబూ అన్నం తిని… ఒక్క రూపాయి దరమం చేయి బాబూ……” బిచ్చగాడూ దీనంగా వేడుకుంటున్నాడు. ” సోదరులారా మనది ఎంతో విశిష్ట సంస్కృతి, ఘనమైన వారసత్వం గల దేశం మనది.” ” సచ్చి మీ కడుపున పుడతాను బాబూ…ఒక్క రూపాయి ధర్మ చేయండి బాబూ…” ” ఎంతో సహనశీలత గల దేశం మనది….” ” ఏరా దొంగ నా కొడుకా. అడుక్కోవడానికి నీకు ఈ మీటింగే కనపడిందా.…