ఢిల్లీ పాప అత్యాచారం: రెండో నిందితుడి అరెస్టు

తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ లో ఐదేళ్ల పాపపై అత్యాచారం జరిగిన కేసులో రెండో వ్యక్తి పాత్రను నిరాకరిస్తూ వచ్చిన పోలీసులు సోమవారం అందుకు విరుద్ధమైన పరిణామాన్ని దేశ ప్రజల ముందు ఆవిష్కరించారు. రెండో నిందితుడుగా భావిస్తున్న ప్రదీప్ ను బీహార్ లోని లఖిసారాయ్ జిల్లా నుండి అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు సోమవారం ప్రకటించారు. తాను పాపపై ఏ అఘాయిత్యానికి తలపెట్టలేదని, అత్యాచారం చేసింది ప్రదీప్ అని మనోజ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పాపపై అత్యాచారం…

అవినీతిని నిలదీసేది దళిత మహిళ ఐతే…

ఆమె ఒక మహిళా సంఘం కార్యకర్త. అవినీతిని నిలదీయడం ఆమె చేసిన నేరం. ఆ మాత్రానికే అత్యంత ఘోరంగా ఆమె పైన అత్యాచారం చేసి, వింటేనే ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో హింసించి చంపేశారు. ఫిర్యాదు చేయబోయిన తండ్రి, కుమారుల పైనే నేరం బనాయించడానికి సిద్ధపడడం పోలీసుల వికృత లీలకు తాజా రూపం. భూస్వామ్య కుల దురహంకారం ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహించే బీహార్ సీమ ఈ ఘోరానికి వేదిక. దేశం మొత్తం అభివృద్ధి పధంలో సాగడానికి తమ…

ముందు నీ రాష్ట్రం సంగతి చూసుకో, మోడీ తో నితీష్

బీహార్ అభివృద్ధిపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వ్యాఖ్యలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరస్కరించాడు. బీహార్ గురించి వ్యాఖ్యానించే ముందు గుజరాత్ సంగతి చూసుకోవాలని హెచ్చరించాడు. నేరుగా మోడీని సంబోధించకుండానే సొంత రాష్ట్ర వ్యవహారం సరిచేసుకోకుండా ఇతర రాష్ట్రాల్లో వేలు పెట్టొద్దని హెచ్చరించినంత పని చేశాడు. బీహార్ లో కుళ్ళిపోయిన కుల రాజకీయాల వల్ల ఆ రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడిపోయిందని ఆదివారం రాజ్ కోట్ లో బి.జె.పి సమావేశంలో ప్రసంగిస్తూ నరేంద్ర మోడి వ్యాఖ్యానించాడు. ఒకప్పుడు…