బి.జె.పి భారీ సమీక్ష -ది హిందు సంపాదకీయం

(నవంబర్ 14 తేదీన ‘ది హిందు’ పత్రిక ప్రచురించిన “BJP’s larger stock-taking” సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.) భారతీయ జనతా పార్టీ ప్రస్తుత నాయకత్వంపై ఆ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ వృద్ధ నాయకులు చేసిన దాడి శబ్దరహిత మధనాన్ని పార్టీపై రుద్దడం కొనసాగుతోంది. అది ఎక్కడికి వెళ్ళి ముగుస్తుందన్నదే ఇంకా స్పష్టం కాలేదు. బుధవారం నలుగురు బి.జె.పి పెద్దలు -ఎల్.కె.అద్వానీ, ఎం.ఎం.జోషి, శాంతా కుమార్, యశ్వంత్ సిన్హా- బీహార్ లో పార్టీ ఓటమికి ప్రధాన…