బి.జె.పి బీమా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు!

విదేశీ బహుళజాతి ద్రవ్య కంపెనీలు ఎంతగానో ఎదురు చూస్తున్న బీమా బిల్లు బుధవారం లోక్ సభలో ఆమోదం పొందింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం విశేషం. దేశ ద్రవ్య వనరులను విదేశీ ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అప్పగించడంలో కాంగ్రెస్, బి.జె.పిల మధ్య ఎలాంటి విభేదము లేదని భీమా బిల్లు ఆమోదంతో మరో సారి స్పష్టం అయింది. భారతీయ జనతా పార్టీ/హిందూత్వ సంస్ధల స్వదేశీ నినాదాలు ఒట్టి బూటకమేనని మరోసారి తేటతెల్లం అయింది.…