కురువృద్ధ కాంగ్రెస్ ను తీరానికి చేర్చేదిలాగేనా! -కార్టూన్
వందకు మించిన పార్లమెంటు సభ్యులకు నాయకత్వం వహించడానికి అలవాటుపడిన నెహ్రూ-గాంధీ కుటుంబం 44 మందికి కుదించుకుపోయిన పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహించడానికి సిగ్గుపడిందో ఏమో గానీ మొదటిసారి లోక్ సభ నాయకత్వాన్ని కుటుంబేతరుడు మల్లిఖార్జున్ ఖార్గే కు అప్పజెప్పింది. మొత్తం పార్లమెంటు సభ్యుల్లో కనీసం 10 శాతం సీట్లన్నా గెలుచుకోలేక ప్రతిపక్ష హోదా కోసం కూడా పాలక కూటమిని బతిమాలుకునే పరిస్ధితిలో ఉన్న కాంగ్రెస్, తెలివిగా దళితుడిని లోక్ సభ నేతగా ఎన్నుకోవడం ద్వారా ప్రతిపక్ష నాయకత్వాన్ని…