దళిత నిరాకరణ నేరంలో సచివులు, నేతలు!

ది హిందు సంపాదకీయం చివరలో పేర్కొన్న ‘నిరాకరణ నేరం’ అప్పుడే జరిగిపోయింది కూడా. విద్యార్ధుల ఆత్మహత్యకు తన లేఖలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పత్రికలు, ఛానెళ్ల సాక్షిగా నిరాకరణ జారీ చేసేశారు.  ఒక్క బండారు మాత్రమే కాదు, బి‌జే‌పి జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు ట్విట్టర్ లో రాహుల్ గాంధీ యూనివర్సిటీ సందర్శనను ఖండిస్తూ పనిలో పనిగా “రోహిత్ దళితుడు కావడానికీ, అతనిని సస్పెండ్ చేయడానికి ఎలాంటి సంబంధమూ లేదు”…

నితీష్: ఆట అనుకున్నది పాటు అయింది -కార్టూన్

ఎట్టకేలకు నితీష్ కుమార్ కి కోరుకున్న కుర్చీ దక్కింది. పెద్ద త్యాగమూర్తి లాగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన తరపున ఒక దిష్టి బొమ్మను నిలబెట్టి ఆనక ఆ దిష్టి బొమ్మను దింపి అటు పదవీ త్యాగ ప్రతిష్టను సంపాదించవచ్చని, ఇటు పదవీ వియోగ దుఃఖాన్ని తప్పించవచ్చని భావించిన నితీష్ కుమార్ కి అనుకున్నది ఎలాగో దక్కించుకునే సరికి తాతలు దిగి వచ్చారు. ముఖ్యమంత్రి కుర్చీ ఆటను పిల్లాడి ఆటగా మార్చి వేసి చివరికి మళ్ళీ…

బి.జె.పి పుండుపై శివసేన ఉప్పు

అసలే పరువు పోయి బాధలో ఉన్నపుడు మిత్రుడు చేసే సరదా ఎగతాళి కూడా కోపం తెప్పిస్తుంది. మిత్రులు అనుకున్నవాళ్లు సీరియస్ గానే ఎగతాళి చేస్తే ఇక వచ్చే ఆగ్రహం పట్టలేము. బి.జె.పి పరిస్ధితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఏఏపి చేతుల్లో చావు దెబ్బ తిన్న దిగ్భ్రాంతి నుండి ఇకా బైటపడక ముందే మహారాష్ట్రలో మిత్ర పక్షంగా అధికారం పంచుకుంటున్న శివ సేన ఎగతాళి ప్రకటనలు చేస్తూ బి.జె.పి దుంప తెంచుతోంది. “వేవ్ కంటే సునామీ ఇంకా శక్తివంతమైనదని…

బి.జె.పిలో మోడి, షా లదే రాజ్యం -కార్టూన్

కాంగ్రెస్ కంటే తమది విభిన్నమైన పార్టీ అని బి.జె.పి నేతలు చెప్పుకుంటారు. కాంగ్రెస్ లో సంస్ధాగత ప్రజాస్వామ్యం బొత్తిగా లేదని, కేవలం కుటుంబ స్వామ్యమే ఉన్నదని వెంకయ్యనాయుడు లాంటి నేతలు తరచుగా ఆరోపిస్తారు. అలాంటి బి.జె.పి లోనూ నేడు కేవలం ఇద్దరంటే ఇద్దరు వ్యక్తులదే ఇష్టా రాజ్యం అయిందని ఈ కార్టూన్ చెబుతోంది. బి.జె.పి చిహ్నం కమలంలో వికసించిన పూ రెమ్మలు మోడి అయితే, వాటికి పత్రహరితాన్ని పోషణగా అందించే ఆకులు అమిత్ షా అని కార్టూనిస్టు…

శివసేనను తంతే కింద పడేది ఎవరు? -కార్టూన్

Yet again a sensible political cartoon from Keshav! కేశవ్ కుంచె నుండి రూపు దిద్దుకున్న మరో సున్నిత హాస్యస్ఫోరకమైన కార్టూన్! బి.జె.పి, శివసేనలు, ఆ పార్టీలు తమదిగా చెప్పుకునే రాజకీయ-సాంస్కృతిక-చారిత్రక భావజాలం రీత్యా, విడదీయరాని, విడదీయ లేని కవలలు. విడదీయలేని కవలలను విడదీయడానికి డాక్టర్లు తీవ్రంగా శ్రమించాలి. వైద్య శాస్త్రంలోని అనేక శాఖలలో నిష్ణాతులయిన వైద్యులు ఉమ్మడిగా, క్రమబద్ధంగా, జాగ్రత్తగా గంటల తరబడి కృషి చేస్తే గాని కవలలు ఇద్దరినీ ప్రాణంతో విడదీయడం సాధ్యం…

మహారాష్ట్ర: శివసేనకు ప్రతిపక్ష పాత్రేనా?

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శివసేన తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలన్న బి.జె.పి లక్ష్యం, ఆరు నూరైనా మహారాష్ట్ర వరకు తనదే పై చేయి కావాలని భావిస్తున్న శివసేన… వెరసి రాష్ట్ర ప్రజల ముందు ఓ వింత నాటకం ఆవిష్కృతం అవుతోంది. బి.జె.పికి బేషరతు మద్దతు ప్రకటించడం ద్వారా ఎన్.సి.పి, శివసేన బేరసారాల శక్తిని దారుణంగా దిగ్గోయడంతో బి.జె.పికి అదనపు శక్తి వచ్చినట్లయింది. కానీ బేషరతు మద్దతు ప్రకటించిన ఎన్.సి.పి అంత తేలిగ్గా సరెండర్ కాదని,…

శివసేన ఉండగా మరియు లేకుండగా… -ది హిందు ఎడిట్

(మహారాష్ట్రలో కొనసా…….. గుతున్న బి.జె.పి-శివసేనల రాజకీయ స్నేహ క్రీడ యొక్క తెర ముందు, వెనకల భాగోతాన్ని అర్ధం చేసుకునేందుకు ఈ నాటి ది హిందు సంపాదకీయం ఉపయోగపడుతుంది. -విశేఖర్) **************** రెండడుగులు ముందుకి, ఒకడుగు వెనక్కి. ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీతో శివసేన సంబంధ బాంధవ్యాలు నెమ్మదిగా కొనసాగడం మాత్రమే కాదు, ఇరు పక్షాలకు బాధాకరంగానూ మారుతోంది. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేలా సేన ప్రముఖ్ ఉద్ధవ్ ధాకరేకు నచ్చజెప్పిన…

అది దాడి బాణమా? కాదు.. కాజాలదు…! -కార్టూన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బి.జె.పిపై శివ సేన చేసిన దాడి అంతా ఇంతా కాదు. ఇక రెండు పార్టీల స్నేహానికి తెరపడినట్లే అన్నంతగా శివసేన దాడి చేసింది. బి.జె.పి మాత్రం వ్యూహాత్మకంగా ‘ధాకరే పైన మాకు ఎనలేని గౌరవం. అందుకే మేము శివసేనను పల్లెత్తు మాట అనం” అంటూ ప్రతి విమర్శకు పూనుకోలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక గాని శివ సేన దాడి అసలు స్వరూపం ఏమిటో వ్యక్తం కాలేదు. ఫలితాలు వెలువడుతున్న కాలంలో ఎన్నికల ముందరి…

బి.జె.పి నేతలు చేసింది లవ్ జిహాద్ కాదా?

  -ప్రవీణ్ భాజపా నాయకులు తమ వ్యక్తిగత జీవితాలలో వెనుకబాటు నమ్మకాలని నమ్మరు. ఆ పార్తీ సీనియర్ నాయకులలోనే నలుగురు మతాంతర వివాహాలు చేసుకున్నారు. వాళ్ళు జనం మీదకి మాత్రం వెనుకబాటు నమ్మకాలని రుద్దుతారు. లవ్ జిహాద్ అనేది నిజంగా జరిగితే షానవాజ్ హుస్సేన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీలు చేసినది కూడా లవ్ జిహాద్ కాదా? వాళ్ళకి భాజపాలో ఉన్నత స్థానం ఎందుకు ఇచ్చినట్టు? ఈ కింది వివాహ సంఘటనలు కూడ “లవ్ జిహాదే” నా? అశోక్…

ఒకరిది హైరానా, మరొకరిది ఘరానా -కార్టూన్

ఆటగాళ్ళు ఇద్దరూ క్రీజు వదిలి మధ్యలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. కాదు, పోట్లాడుకుంటున్నారు. బంతిని తొందర తొందరగా వికెట్ల దగ్గరికి విసిరేస్తే వికెట్లను పడగొట్టి ఆటగాళ్లను ఔట్ చేయొచ్చని ఫీల్డర్లు, బౌలర్, వికెట్ కీపర్ ల హైరానా! ఒక ఆటగాడే మొత్తం టైమ్ అంతా తినేస్తున్నాడు. మరో ఆట గాడికి బ్యాట్ ఝుళిపించే సమయం దొరికి చావడం లేదు. స్ట్రైకింగ్ ఛాన్స్ వస్తే తన సత్తా చూపించవచ్చని మరో ఆటగాడి ఆత్రం. కానీ తాను నిలదొక్కుకున్నా గనక తన…

ఉప ఎన్నికలు: సడలుతున్న బి.జె.పి కుదుళ్లు

పార్లమెంటు, అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రదర్శనకు ఉప ఎన్నికల ఫలితాలు దాదాపు విరుద్ధంగా వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు మధ్య ప్రజలు తేడా చూడడం ప్రారంభించారా అన్న అనుమానం కూడా ఉప ఎన్నికల ఫలితాలు కలిగిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే భారత ప్రజలు సాపేక్షికంగా రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్లే లెక్క. ఎలా చెప్పుకున్నా బి.జె.పి, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే లోక్ సభ ఎన్నికల్లో…

ఢిల్లీ: ఎఎపి నేతకు సి.ఎం పదవి ఎరవేసిన బి.జె.పి

“The Party with a difference” అని బి.జె.పి నేతలు తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. “The party with differences” అని కాంగ్రెస్ పరాచికాలాడుతుంది. కాంగీ పరాచికాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ కంటే తాము భిన్నం ఏమీ కాదని వివిధ సందర్భాల్లో బి.జె.పి నిరూపించుకుంది. తాజాగా ఎ.ఎ.పి ని చీల్చి ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు బి.జె.పి ప్రయత్నించిన సంగతి వెల్లడి అయింది. గత లోక్ సభ ఎన్నికల్లో అమేధిలో రాహుల్ గాంధీ పై పోటీ…

(బి.జె.పి లో) తరాల మార్పులు -ది హిందు సంపాదకీయం

బి.జె.పిలో అత్యంత శక్తివంతమైన పార్లమెంటరీ బోర్డు నుండి త్రిమూర్తులు అతల్ బిహారీ వాజ్ పేయి, ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషిల నిష్క్రమణ, నూతనంగా సృష్టించిన సలహా కమిటీ మార్గదర్శక మండలిలోకి వారి తరలింపు… ఒక శకం ముగిసిందని సంకేతం ఇచ్చాయి. తన సైద్ధాంతిక నిలయానికే పార్టీ లంగరు తాళ్ళు కట్టివేయబడడం కొనసాగినప్పటికీ దాని పని విధానం మాత్రం -బి.జె.పి పరివర్తన వరకు జరిగిన పరిణామాలను బట్టి- అనివార్యంగా ప్రస్తుతం ఆ పార్టీని నియంత్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ప్రధాని…

అమిత్ షా: కమల దళాలే ఆక్టోపస్ చేతులవ్వాలి -కార్టూన్

బి.జె.పి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన అమిత్ షా భారత దేశం కోసం తాను కంటున్న కలలేమిటో వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి అమిత్ షాకు అప్పగించడానికి బి.జె.పి కార్యర్గం లాంఛన ప్రాయంగా ఆమోద ముద్ర వేసిన అనంతరం ఆయన బి.జె.పి జాతీయ కౌన్సిల్ ను ఉద్దేశించి ప్రసంగించారు. సదరు ప్రసంగంలో తన ఉద్దేశ్యాలేమిటో శాంపిల్ గా వివరించారాయన. ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఐడియాలజీ ఒక్కటే దేశాన్ని శాసించిందని ఇక నుండి కాంగ్రెస్ ఐడియాలజీని పక్కకు నెట్టి కేవలం బి.జె.పి…

గడ్కారీ బెడ్రూంతో పాటు ఇంటింటికీ బగ్ అమర్చాలి -కార్టూన్

“మన సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటింటికీ బగ్ అమర్చాలి…” *** బి.జె.పి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ఇంట్లో రహస్య ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి ఉన్న సంగతి వెల్లడి అయింది. 2009లో బి.జె.పి అధ్యక్షుడుగా పదవి చేపట్టిన అనంతరం ఆయనకు అధికారిక నివాసాన్ని కేటాయించారు. ఆయన ఇప్పటికీ ఆ ఇంట్లోనే కొనసాగుతున్నారు. ఆయన నిద్రించే బెడ్ రూమ్ లో సంభాషణలు వినే పరికరం రహస్యంగా అమర్చినట్లు వెల్లడి కావడంతో కాంగ్రెస్, తదితర…