రమ్మన లేక… పొమ్మన లేక… -కార్టూన్

మహారాష్ట్రలో శివసేన పరిస్ధితి మరీ దిగజారిపోయింది. ప్రభుత్వంలో చేరాలని ఉంది, కానీ ఎన్నికల్లో బి.జె.పి సాధించిన ఆధిక్యం ద్వారా సంక్రమించిన  ఆధిపత్యాన్ని తట్టుకోలేరు. కనీసం 2 మంత్రి పదవులైనా దక్కుతాయనుకుంటే అవీ ఇచ్చే ఉద్దేశ్యం లేదని బి.జె.పి నిర్మొహమాటంగా స్పష్టం చేసింది.  అలాగని అధికారానికి దూరంగానూ ఉండలేరు. సహజ మిత్రులుగా మొన్ననే తమను తాము అభివర్ణించుకుంటిరి. అలాంటి మిత్ర పార్టీ మొట్ట మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే అందులో భాగస్వామ్యం లేకపోవడం వారికి అవమానం. బి.జె.పి దూరం…