కర్ణాటకలో తెగిపడిన మరో తల -కార్టూన్
తమది భిన్నమైన పార్టీ (party with a difference) గా బి.జె.పి చెప్పుకుంటుంది. ఆచరణలో మాత్రం అంతేలేని విభేదాల పార్టీగా (party with unending differences) అనేకసార్లు రుజువు చేసుకుంది. బి.ఎస్.యెడ్యూరప్ప ఆశీస్సులతో సదానంద గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పదకొండు నెలలకే అదే యెడ్యూరప్ప ఆగ్రహానికి గురై పదవి కోల్పోవడం అందుకు నిదర్శనం. సదానంద గౌడ పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని 45 మంది ఎం.ఎల్.ఎ లతో సహా ఎగ్గొట్టిన జగదీష్ షెట్టర్, యెడ్యూరప్ప అనుగ్రహం…