హోమ్ మంత్రి తూణీరం ఎదురు తిరిగిన వేళ -కార్టూన్

యుద్ధంలో ప్రత్యర్ధుల బాణాలను ఎదుర్కోక ఎలాగూ తప్పదు. కానీ స్వపక్షంలోని వారే వెనుక నుండి బాణాలు వదిలితే? భారత హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పరిస్ధితి అలాగే ఉందని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయి. బి.జె.పి పార్టీని తన అస్త్ర, శస్త్రాలను నిలువ చేసుకునే అమ్ముల పొదగా హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ భావిస్తున్నారు. కానీ పార్టీలోనే అధికారం కోసం జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల ఫలితంగా స్వపక్షం వారే ఆయనపై అస్త్రాలను ప్రయోగించి దొంగ దెబ్బ…