దావూద్ ఎక్కడున్నాడో మాకు తెలియదు -కేంద్రం

యు.పి.ఏ పాలనలో దావూద్ ఇబ్రహీం ను ఇండియా రప్పించలేకపోయినందుకు బి.జె.పి నేతలు చెయ్యని అపహాస్యం లేదు. చెయ్యని ఆరోపణ లేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడంలో యు.పి.ఏ ఘోరంగా విఫలం అయిందంటూ బి.జె.పి చేసే ఆరోపణలో దావూద్ ఇబ్రహీం వ్యవహారం కూడా కలిసి ఉంటుంది. పాక్ లో ఉన్న దావూద్ ని అరెస్టు చేసి ఇండియా రప్పించడం చేతకాలేదని బి.జె.పి నేతలు అనేకసార్లు ఆరోపించారు. అలాంటి దావూద్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని అధికారం లోకి వచ్చాక బి.జె.పి…