అమెరికా విదేశీ మంత్రులపై జర్మనీ గూఢచర్యం

తమ దేశంలో గూఢచర్యం చేసినందుకు అమెరికాపై కారాలు మిరియాలు నూరుతున్న జర్మనీ అమెరికా పైన తానూ అదే నిర్వాకానికి పాల్పడింది. ఈ సంగతి జర్మనీ పత్రిక డెర్ స్పీజెల్ బైట పెట్టింది. అయితే అది పొరబాటున జరిగిందని అది కూడా ఒక్కసారే జరిగిందని ఆ పత్రిక చెబుతోంది. ఒబామా మొదటి అధ్యక్షరికంలో విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) గా హిల్లరీ క్లింటన్ పని చేయగా రెండో విడత అధ్యక్షరికంలో జాన్ కెర్రీ పని చేస్తున్నారు. వీరిద్దరి…

గూఢచారుల పేర్లివ్వండి! -ఎంబసీలకు జర్మనీ ఆదేశం

జర్మనీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఎన్.ఎస్.ఎ, సి.ఐ.ఎ లాంటి అమెరికా గూఢచార సంస్ధలతో విసిగిపోయి ఇక ఎంత మాత్రం సహించలేని దశకు చేరుకున్నట్లుగా సంకేతాలిస్తూ దేశంలోని విదేశీ ఎంబసీలన్నీ తమ గూఢచార అధికారుల పేర్లను వెల్లడించాలని ఆదేశించింది. తమ దేశంలో విధులు నిర్వర్తిస్తున్న గూఢచారులందరి పేర్లను తమకు అప్పగించాలని కోరింది. ఈ మేరకు విదేశీ ఎంబసీలన్నింటికీ జర్మనీ ప్రభుత్వం గత వారం లేఖలు రాసిందని పత్రికలు సమాచారం ఇచ్చాయి. జర్మనీ విదేశీ మంత్రిత్వ శాఖ…