కార్మికుల సమ్మెకు మోడి పరిష్కారం: విభజించు-పాలించు
కార్మికుడిని “శ్రమ యోగి” గా ప్రధాని నరేంద్ర మోడి అభివర్ణించారు. కార్మికులను ఆకాశానికి ఎత్తుతూ ‘శ్రమయేవ జయతే” అని నినాదం ఇచ్చారు. ఆయన అభివర్ణన, నినాదం కేవలం అలంకార ప్రాయమే అని కార్మికులకు తెలియడానికి నెల రోజులు కూడా పట్టలేదు. గత అరవై యేళ్లుగా భారత దేశ ప్రజల ఇంధనం అవసరాలను కోల్ ఇండియా కంపెనీ తీరుస్తోంది. అలాంటి కంపెనీలో వాటాలను మోడి ప్రభుత్వం ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అమ్మేయడానికి నిరసనగా కార్మికులు సమ్మె బాట పట్టారు.…