క్రికెట్ దసరా, ముసలోళ్ళకి లేదిక! -కార్టూన్ 

ఎట్టకేలకు క్రికెట్-రాజకీయ మరియు రాజకీయ-క్రికెట్ పెద్దల నిరసనల మధ్య సుప్రీం కోర్టు, జస్టిస్ లోధా కమిటీ నివేదికను ఆమోదించింది. కమిటీ ప్రతిపాదించిన, తాము ఆమోదించిన సిఫారసులను ఆరు నెలల లోపు బిసిసిఐ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిటీ సిఫసిఫారసుల మేరకు రాజకీయ పదవులు అనుభవిస్తున్న వారు క్రికెట్ పాలనా పదవులలో ఉండటానికి వీలు లేదు. ఆ లెక్కన ఢిల్లీ క్రికెట్ సంఘం నేతగా కొనసాగుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి.…