ప్రాణాలు ఫణంగా పెట్టే ‘టఫ్ గై’ సవాలు! -ఫోటోలు

బ్రిటన్ లో ప్రతి సంవత్సరం జరిగే ‘టఫ్ గై ఛాలెంజ్’ పోటీలు మళ్ళీ జరిగాయి. జనవరి నెల చివరి వారంలో జరిగే ఈ పోటీలు ఈసారి ఫిబ్రవరి 1 తేదీన జరిగాయి. ప్రపంచం నలుమూలల నుండి, ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల నుండి వేలాదిగా తరలివచ్చే ఉక్కు పిండాలు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఇంతవరకు ఈ పోటీల్లో చివరి వరకు నిలబడిన ‘టఫ్ గై’ ఒక్కరు కూడా లేకపోవడం బట్టి పోటీల పస ఏమిటో తెలుసుకోవచ్చు. ఛారిటీ…