భారత్ పై అతి కేంద్రీకరణే లాడెన్ హత్యకు అవకాశం -పాక్ రిపోర్ట్

భారత దేశంతో ఉన్న సరిహద్దులపై అతిగా దృష్టి కేంద్రీకరించడం వల్లనే అమెరికా నేవీ సీల్ బృందం, పాకిస్ధాన్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్ ఇంటిపై దాడి చేయగలిగిందని పాకిస్ధాన్ విచారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికా మిలట్రీ సంపాదించుకున్న స్టెల్త్ టెక్నాలజీ (సాధారణ పరిజ్ఞానానికి దొరకని విధంగా విమానాలు ఎగరగల సామర్ధ్యం) కూడా లాడెన్ ఇంటిపై దాడిని విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడిందని సదరు నివేదిక తెలిపింది. మే 2, 2011 తేదీన…

అమెరికా మానవహక్కుల ఉల్లంఘనదారు -ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

అంతర్జాతీయ చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ అమెరికా మానవ హక్కులను కాల రాస్తున్నదని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధగా ప్రాచుర్యం పొందిన ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నివేదిక ఆరోపించింది. రహస్య కమెండో ఆపరేషన్ లో lethal force వినియోగించి ‘ఒసామా బిన్ లాడెన్’ ను  చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది. స్వతంత్ర దేశం యెమెన్ పై డ్రోన్ విమానాలతో దాడులు చేసి అమెరికా పౌరుడు అన్వర్ ఆల్-అవలాకి ని, ఆయన సహచరులను చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది.…

బిన్ లాడెన్ కుటుంబం అప్పగింతకు పాకిస్ధాన్ నిరాకరణ

ఒసామా బిన్ లాడెన్ భార్యలను, పిల్లలను తమ స్వస్ధాలకు పంపడానికి పాకిస్ధాన్ దాదాపుగా నిరాకరించింది. ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం అతని భార్యలను, పిల్లలను పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. లాడెన్ హత్యపై విచారణకు ప్రభుత్వం నియమించిన కమిషన్ అంగీకరిస్తే తప్ప ఆయన కుటుంబాన్ని ఇతర దేశాలకు అప్పగించబోమని పాక్ ప్రభుత్వ పానెల్ ప్రకటించింది. ముగ్గురు భార్యలు, 13 మంది పిల్లలతో కూడిన ఒసామా కుటుంబం ప్రస్తుతం పాకిస్ధాన్ ప్రభుత్వ రక్షణలో ఉన్నారు. మే 2…