సామ్రాజ్యవాదుల కోసం తయారు చేసిన శ్వేతపత్రం, బడ్జెట్ 2015-16 -(1)

స్వదేశీ, విదేశీ ప్రభువర్గాలు ఏరి కోరి తెచ్చుకున్న మోడి ప్రభుత్వం తమపై ఉంచిన విశ్వాసాన్ని కాపడుకుంటూ మొట్ట మొదటి పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ 2015-16 ను ప్రవేశపెట్టింది. బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వం మెజారిటీ సాధించినట్లు వార్తలు వెలువడుతుండగానే పశ్చిమ బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు కొత్త ప్రభుత్వం నెరవేర్చవలసిన తమ డిమాండ్లు ఏమిటో విస్పష్టంగా తమ కార్పొరేట్ మీడియా ద్వారా ప్రకటించాయి. ఆ డిమాండ్లను త్రికరణశుద్ధిగా నెరవేర్చుతూ మోడి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వేసిన అడుగు ‘బడ్జెట్ 2015-16’. ఒకవైపు…