ఫేస్ బుక్ అరెస్టు: ఎస్.పి సస్పెన్షన్, జడ్జి బదిలీ

ఫేస్ బుక్ వ్యాఖ్యలను పట్టుకుని ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేసిన కేసులో తలలు తెగిపడుతున్నాయి. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు బహిరంగ హెచ్చరిక పర్యవసానంగా దేశ వ్యాపితంగా న్యాయ వర్గాలలో కూడా కాక పుట్టించిన ఫేస్ బుక్ అరెస్టు భారత ప్రజాస్వామ్య సౌధం బండారాన్ని బైటపెట్టే పరిస్ధితి తలెత్తడంతో బలి పశువుల తలలు దొర్లి పడుతున్నాయి. ధాణే జిల్లా ఎస్.పి (రూరల్) తో పాటు ఇద్దరు…

బాల్ ధాకరే అస్తమయం -కార్టూన్

బహుశా, ఈ కార్టూన్ కి ప్రత్యేక వివరణ అవసరం లేదేమో. స్వయంగా కార్టూనిస్టు అయిన బాల్ ధాకరేకు మరో ప్రఖ్యాత కార్టూనిస్టు కేశవ్ (ది హిందూ) ఇచ్చిన నివాళి ఇది.     –

ఫేస్ బుక్ లో ధాకరే బంద్ వ్యతిరేకించిన మహిళల అరెస్టు, ఉగ్రుడయిన జస్టిస్ కట్జు

ధాకరే అంతిమ యాత్ర కూడా ముంబై ప్రజలకు విద్వేషంలోని మరో కోణాన్ని చవి చూపింది. ధాకరే అంతిమయాత్ర కోసం ముంబై బంద్ పాటించడం వ్యతిరేకిస్తూ ఫేస్ బుక్ లో సందేశం ఉంచిన అమ్మాయితో పాటు ఆ సందేశాన్ని లైక్ చేసిన మరో అమ్మాయిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చర్యపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అమ్మాయిల అరెస్టుకు పాల్పడిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ కోరుతూ ఆయన…

నేనెందుకు ధాకరేకు నివాళులు అర్పించలేను? -జస్టిస్ కట్జు

(జస్టిస్ మార్కండేయ కట్జు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేశాడు. ఇప్పుడాయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఛైర్మన్. తన అభిప్రాయాలను జస్టిస్ కట్జు నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తాడని పేరు. దానివలన ఆయనకి మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులూ దాదాపు అంతమంది ఉన్నారు. ముద్రణా మీడియాపై నియంత్రణ ఉన్నట్లే దృశ్య, శ్రవణ మీడియా పై కూడా పరిమిత నియంత్రణ ఉండాలని వాదించడం వలన ఆయనకి మీడియాలో కూడా వ్యతిరేకులు ఉన్నారు. రెండు రోజుల…

కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై గురువింద ధాకరే మండిపాటు

చూసే తీరిక ఉండాలే గానీ భారత రాజకీయ నాయకుల సర్కస్ విన్యాసాలకు, రెండు నాలుకల ప్రకటనలకు కొదవ ఉండదు. కొడుకు ఉద్ధవ్ ధాకరే తో పాటు మనవడు అధిత్య ధాకరేను కూడా శివసేన ఆధిపత్య స్ధానాలకు నామినేట్ చేసిన బాల్ ధాకరే కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై మండిపడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి కోసం ఆశపడుతున్నాడనీ, ప్రియాంక గాంధీ మరో ఇందిరా గాంధీ లాగా రాజకీయాల్లో ఎదగలానుకుంటున్నదనీ వాపోయాడు. శివసేనలో మాత్రం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నదనీ…

సచిన్ రాజ్య సభ్యత్వం వెనుక కాంగ్రెస్ కుట్ర -కార్టూన్

సచిన్ టెండూల్కర్ కి  రాష్ట్ర పతి కోటాలో రాజ్య సభ సభ్యత్వం కట్టబెట్టడం వెనుక కాంగ్రెస్ కి మోసపూరిత ఉద్దేశ్యాలున్నాయని బాల్ ధాకరే ఆరోపించాడు. బాల్ ధాకరే ఆరోపణలకు ‘ది హిందూ’ కార్టూనిస్టు సురేంద్ర ఇచ్చిన కార్టూన్ రూపం ఇది. కాంగ్రెస్ కి ఏ ఉద్దేశ్యాలున్నాయో ఏమో గాని రాజకీయ చదరంగంలో సచిన్ ఒక పావుగా మారే సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి. మరో పక్క రాజ్య సభ సభ్యత్వం స్వీకరించినంత మాత్రాన తాను రాజకీయాల్లోకి రాబోనని సచిన్…