అది మిసైల్ కాదు, స్పేస్ వెహికల్ -చైనా
హైపర్ సోనిక్ మిసైల్ ను తాము పరీక్షించామంటూ వచ్చిన వార్తలు నిజం కాదని చైనా ప్రకటించింది. “అది అంతరిక్ష వాహకం, మిసైల్ కాదు” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ సోమవారం విలేఖరుల ప్రశ్నలకు బదులు ఇస్తూ చెప్పాడు. తాము హైపర్ సోనిక్ వాహకాన్ని ప్రయోగించి పరీక్షించామే తప్ప హైపర్ సోనిక్ మిసైల్ ని పరీక్షించలేదని ఝావో వివరించాడు. “అది కూడా ఫైనాన్షియల్ టైమ్స్ చెప్పినట్లు ఆగస్టులో కాదు, జులైలో ఆ పరీక్ష జరిగింది”…