సంచలనం! సంచలనం!! మాయాకొడ్నానికి మరణ శిక్ష కోరనున్న మోడి

ఇండియాలో నర మానవుడెవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది. దేశ రాజకీయాల్లో కార్డులు అట్టా ఇట్టా కాకుండా తిరగబడుతున్నాయి. దేశ అత్యున్నత పదవికి గురి పెట్టిన నరేంద్ర మోడి అందుకు స్వపక్షీయులనే బలిపశువులుగా నిలబెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఒకప్పటి తన నమ్మిన బంటులను ‘ప్రధాని పదవి’ అనే దేవత కోసం పార్లమెంటు ఎన్నికల వధ్య శిల పైన బలిగా అర్పించబోతున్నాడు. తన ఆజ్ఞ, అనుజ్ఞలతో గుజరాత్ లోని నరోద పాటియాలో పేద ముస్లిం ప్రజలను అత్యంత దారుణంగా…