కమండలం నుండి కమేండోల వరకూ… -కార్టూన్

హిందూత్వ ప్రబోధకులు గొప్పగా చెప్పుకునే సనాతన స్వర్ణ యుగంలో మునులు, సాధువులు, బాబాలు, గురువులు ఏం చేసేవారు? ముక్కు మూసుకుని ఒంటికాలి తపస్సు చేసేవారు. హిమాలయాలకు చేరి పవిత్ర గంగా తీరాన లేదా మరో నది తీరాన కమండల ధారియై తపమాచరించెడివారు. సర్వసంగపరిత్యాగియై హరహర శంభో అంటూ దివ్యజ్ఞానార్ద్ధులై కఠోర బ్రహ్మచర్యం పాటించేవారు. శిష్యులను వెంటేసుకుని ధర్మ ప్రబోధం కావించేవారు. మనం చూడకపోయినా మన పుస్తకాలు, కధలు, బోధనలు ఈ సంగతి చెబుతాయి. మరి ఇప్పుడో! ఏ.సి…

బాబా రాంపాల్ అరెస్టుకు సాయుధ ప్రతిఘటన

దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించని నేపధ్యంలో బాబా రాంపాల్ ని అరెస్టు చేయలేక హర్యానా పోలీసులు నిస్సహాయులుగా మిగిలారు. హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న బాబా రాంపాల్ అనేకసార్లు కోర్టుకు హాజరు కాకుండా చట్టం అంటే తనకు లెక్కలేదని చాటాడు. ఆయన్ని అరెస్టు చేసి తేవాలని పంజాబ్ & హర్యానా హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆయనకు వంట్లో బాగాలేదని కాబట్టి అరెస్టు చేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పడం బట్టి భారత దేశంలో కోర్టులు ఏ…