బాబా రాందేవ్ మందు తింటే మగ పుట్టుక గ్యారంటీ(ట)!

భారత సామాజిక వ్యవస్ధ ప్రయాణం పైకి ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో మధ్య యుగాల చెంతకు ప్రయాణిస్తోందని చెప్పేందుకు మరో దృష్టాంతం ఇది! పురోగమనం, ప్రగతి, అభివృద్ధి, ముందడుగు… ఇలాంటి పదాలు తమ అర్ధాన్ని కోల్పోవడమే కాదు, విచిత్రార్ధాల్ని సృష్టిస్తున్న కాని కాలంలో ఉన్నామని బాబా రాందేవ్ గారి దివ్య ఔషధ వ్యవస్ధ స్పష్టం చేస్తోంది. బాబా రాందేవ్ నెలకొల్పిన ఆయుర్వేద ఔషధ కంపెనీ ‘పతంజలి ఆయుర్వేద కేంద్ర ప్రైవేట్ లిమిటెడ్’ ఒక ఔషధం తయారు చేసింది.…

దళితులతో రాహుల్ హానీమూన్, రాందేవ్ వెకిలి వ్యాఖ్యలు

స్వయం ప్రకటిత యోగా గురువు బాబా రాందేవ్ రాహుల్ గాంధీపై విమర్శల పేరుతో వెకిలి వ్యాఖ్యలు చేసి తన మకిలి బుద్ధిని చాటుకున్నాడు. హానీమూన్, పిక్ నిక్ లు జరుపుకోవడం కోసమే రాహుల్ గాంధీ దళితుల ఇళ్లకు వెళ్తున్నాడని కు వ్యాఖ్యలకు దిగాడు. ఆనక దళితులు బాధపడితే క్షమించాలని విన్నవించుకున్నాడు. ఆలోచించి చేసే వ్యాఖ్యలు బహుశా ఆయా వ్యక్తుల అసలు బుద్ధిని బైటపెట్టలేకపోవచ్చు. ఉద్దేశించిన లక్ష్యానికి మేలు జరుగుతుందా లేక కీడు జరుగుతుందా అన్న విచికిత్స చేసుకున్నాక…

మోడీకి రామ్ దేవ్ మద్దతు, షరతులతో… -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అందరికీ ఐడియాలు సమకూర్చిపెడుతోంది. బేషరతు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ కు 18 షరతులు విధించిన ఆప్, అనంతరం కాంగ్రెస్ మద్దతు స్వీకరణకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వినూత్న ప్రజాస్వామిక ఆచరణకు నాంది పలికింది. ఆప్ నుండి ‘క్లూ’ అందిపుచ్చుకున్నారేమో ఇప్పుడు బాబా రామ్ దేవ్ మోడీకి మద్దతు ఇస్తాను గానీ అందుకు కొన్ని షరతులు ఉన్నాయ్ అంటున్నారు. తాను మొదట కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చాననీ కానీ…

పౌరసమాజ నాయకులను ఐక్యం చేసిన రామ్‌దేవ్ అరెస్టు, లాఠీ ఛార్జీ

ఆదివారం వేకువ ఝామున బాబా రాందేవ్ ఆమరణ నిరాహార దీక్షా శిబిరంపై పోలీసులు దాడి చేయడమే కాకుండా, టియర్ గ్యాసు ప్రయోగించి, లాఠీ ఛార్జీ కూడా చేయడంతో అప్పటివరకు వివిధ కారణాలతో ఎడమొగం పెడమొగం గా ఉన్న పౌర సమాజ నాయకులుగా మన్ననలు అందుకుంటున్నవారిని ఏకం చేసింది. రాం దేవ్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి ముప్ఫై మందిక పైగా కార్యకర్తలను గాయపరచడాన్ని అన్నా హజారే, అరుణా రాయ్, కేజ్రివాల్ తదితరులు తీవ్రంగా ఖండించారు. కనీసం నిరసన…

లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం సీరియస్‌గా లేదు, మరోసారి నిరాహార దీక్ష చేస్తా! -అన్నా హజారే

కేంద్ర ప్రభుత్వ హామీని నమ్మి తన నాలుగు రోజుల నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారేకు కేంద్ర ప్రభుత్వం అసలు స్వరూపం మెల్ల మెల్లగా అర్ధం అవుతోంది. అవినీతి ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఒట్టి గాలి మూటలేనని తెలిసి వస్తోంది. ఎన్నికల మేనిఫేస్టో పేరిట లిఖిత హామిలు ఇచ్చి పచ్చిగా ఉల్లంఘించే భారత దేశ రాజకీయ పార్టీలు ఒక సత్యాగ్రహవాదికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, ఉఫ్… అని ఊదిపారేయడం చిటికేలో పని అని గతం కంటే ఇంకా…

బాబా రామ్ దేవ్ ని అరెస్టు చేశారు, హరిద్వార్ కి తోలారు, దీక్ష ముగిసింది

భారత దేశ రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారుల అంతులేని అవినీతి పైన యుద్ధం ప్రకటించిన బాబా రామ్ దేవ్ ని అరెస్టు చేశారు. విదేశాల్లో దాచుకున్న అవినీతి డబ్బుని దేశానికి రప్పించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. 2014 లో ఓ రాజకీయ పార్టీ పెడతానని చెబుతున్న ఈయన కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని అసాధ్యమైన డిమాండ్లు కూడా ఉంచాడు. తాము అనుమతిని 5,000 మందికి యోగా శిక్షణ ఇస్తానంటే ఇచ్చామనీ, 50,000 మందిని తెచ్చి గొడవ చేయడానికి…

ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నించింది -అన్నా హజారే

భారత దేశంలోని ప్రఖ్యాత యోగా గురువు బాబా రామ్ దేవ్ జూన్ 4 తారీఖునుండి ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. విదేశీ బ్యాంకుల్లో భారత దేశ రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు రహస్యంగా దాచుకున్న నల్ల ధనాన్ని భారత దేశానికి తిరిగి తెప్పించాలని ఆయన ప్రధాన డిమాండు. బాబా రామ్ దేవ్ తన దీక్షను ప్రారంభించడానికి బుధవారం ఢిల్లీకి ప్రయాణం కట్టగా ప్రధాని మన్మోహన్ సింగ్ దీక్ష ఆలోచనని విరమించుకోవాలని స్వయంగా రామ్ దేవ్‌కి విజ్ఞప్తి చేశాడు.…