బాబా రాందేవ్ దీక్షా శిబిరంపై పోలీసు దాడికి చిదంబరమే బాధ్యుడు -సుప్రీం అమికస్ క్యూరి

విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలన్న డిమాండ్ తో బాబా రాందేవ్ ప్రారంభించిన నిరాహార దీక్షా శిబిరంపై ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి చేసిన దాడికి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం బాధ్యుడని సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ నిర్ధారించాడు. రాందేవ్ నిరాహార దీక్ష శిబిరంపై పోలీసులు అమానుషంగా దాడి చేశారన్న వార్తలు పత్రికలలో రావడంతో సుప్రీం కోర్టు తనంతట తానే ఈ కేసును చేపట్టింది. అనంతరం కేసు విచారణలో తనకు సాయపడాలని కోరుతూ సుప్రీం కోర్టు, సీనియర్…