సర్వ మత హక్కులు కాపాడుతాం –మోడి

“ప్రతి పౌరుని యొక్క హక్కులను, స్వేచ్చను మేము రక్షించి కాపాడతాం. ప్రతి ఒక్క మతము, సంస్కృతి, నమ్మకాలకు చెందిన ప్రతి ఒక్క పౌరుడికి మా సమాజంలో సమాన స్ధానం ఉండేలా చూస్తాము. మా భవిష్యత్తులో నమ్మకాన్ని కల్పిస్తాము. ఆ భవిష్యత్తు సాధించేందుకు విశ్వాసం ఇస్తాము.” ఇవి ఫ్రెంచి గడ్డపై ప్రధాని నరేంద్ర మోడి పలికిన పలుకులు. ఫ్రెంచి నేల మనది కాదు. కనీసం మన పాత వలస ప్రభువు కూడా కాదు. ప్రధాని అక్కడికి వ్యాపార ఒప్పందాల…