ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధే రైతులకు నష్టాల్నీ పేదలకు ఆకలి చావుల్నీ సృష్టిస్తోంది -ఆక్స్‌ఫాం

ప్రపంచ దేశాల్లొ ప్రస్తుతం కొనసాగుతున్న ఆహార పంపిణీ వ్యవస్ధలే పేదల్ని ఆకలి చావులకు గురి చేస్తున్నదని చారిటీ సంస్ధ ఆక్స్‌ఫాం కుండ బద్దలు కొట్టింది. ప్రపంచ ఆహార వ్యవస్ధ కేవల కొద్దిమంది కోసమే పని చేస్తున్నదని, మిగిలిన వారందరికీ అది విఫల వ్యవస్ధగా మారిందనీ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫాం పేర్కొంది. ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధ, ఆహారాన్ని వినియోగించే బిలియన్ల మంది ప్రజలకు తాము ఏమి కొంటున్నదీ, ఏమి తింటున్నదీ అన్న అంశాలపై సరిపోయినంత…

దేశవ్యాపితంగా వెల్లివిరుస్తున్న క్రికెట్ దేశభక్తి

క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభం కావడానికి నెల ముందునుండే (ఇంకా ముందన్నా ఆశ్చర్యం లేదు) భారత దేశ వ్యాపితంగా  దేశభక్తి వెల్లివెరుస్తోంది. ఇతర దేశాల సంగతేమో గానీ ఇండియాలో మాత్రం దేశభక్తికి సీజన్లు ఉంటాయి. అంటే సీజన్ ను బట్టి దేశభక్తి లక్షణాలు మారుతుంటాయి. దేశభక్తి అంటే ఎల్లప్పుడూ ఒక్కటే అర్ధం కదా అంటే, నిజమే. సర్వకాల సర్వావస్ధలయందూ ఒకటే అర్ధం. కానీ ఇండియాలో దేశభక్తి అన్ని కాలాల్లో వ్యక్తం కాదు. కొన్ని సీజన్లలో దేశభక్తి…