పోలీసులు చంపిన 23 మందీ గిరిజనులే, నక్సలైట్లు కాదు -పత్రికలు
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బసగూడ వద్ద సి.ఆర్.పి.ఎఫ్ జరిపిన ఎన్ కౌంటర్ లో చనిపోయినవారంతా అమాయక గిరిజనులేనని వారిలో ఎవరూ నక్సలైట్లు లేరనీ పత్రికలు, చానెళ్ళు వెల్లడి చేశాయి. చనిపోయినవారిలో ఎవరూ మావోయిస్టులు లేరని మావోయిస్టు నాయకుడు ఉసెండి తమ కార్యాలాయానికి ప్రకటన పంపినట్లు ఎ.బి.ఎన్ టి.వి చానెల్ తెలియజేయగా, చనిపోయినవారిలో ఎక్కువమంది గిరిజనులే అయి ఉండవచ్చని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. చనిపోయినవారిలో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారనీ బాలికలను…