సిరియాలో ఎగదోసిన మంటలు ఫ్రాన్స్ లోకి!

ఉగ్రవాద పెనుభూతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాని ఫలితంగానే ప్యారిస్ పైన టెర్రరిస్టు దాడి జరిగిపోయింది. మానవత్వం మరిచిపోయిన కిరాతక ఉగ్రవాదులు అత్యంత సుందర నగరం ప్యారిస్ పై దాడి చేసి రక్తపాతం సృష్టించారు. 130 మందిని పొట్టన బెట్టుకున్నారు. సంగీత తరంగంలో మునిగిన వారిని, క్రీదానందంలో ఉన్నవారినీ, షాపింగ్ కు వచ్చినవారిని… వారూ వీరు అని లేకుండా అమాయకుల రక్తాన్ని చవిచూచారు. సోషలిస్టు భావ తరంగం ఊపిరి పోసుకున్న నేల ఉగ్ర మూకల పదఘట్టనలతో మైలపడిపోయింది!…

జెనీవా 2: అమెరికా, యు.ఎన్ లను కడిగేసిన సిరియా

స్విట్జర్లాండ్ నగరం మాంట్రియక్స్ లో ‘జెనీవా 2’ ముందరి చర్చలు ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటుకు సంబంధించి అమెరికా, రష్యాలు దాదాపు సంవత్సరం క్రితం ఏర్పాటు చేయతలపెట్టిన చర్చలివి. జెనీవా 2 పేరుతో జనవరి 24 నుండి జరగనున్న చర్చలకు ప్రిపరేటరీ సమావేశాలుగా మాంట్రియక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇరాన్ ను కూడా ఆహ్వానించిన ఐరాస నేత బాన్ కి-మూన్ సోకాల్డ్ సిరియా ప్రతిపక్షాలు, అమెరికా వ్యతిరేకించడంతో ఇరాన్ కి ఇచ్చిన ఆహ్వానాన్ని…

సిరియా: అంతులేని విధ్వంసం, హత్యాకాండల యుద్ధక్షేత్రం -ఫోటోలు

సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అన్న లెనిన్ మహాశయుని చారిత్రక ప్రతిపాదన ఎంత వాస్తవమో చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది. సిరియా అందుకు తాజా రుజువు. అమెరికా, ఐరోపా రాజ్యాల వనరులు, మార్కెట్ల దాహానికీ, అంతర్జాతీయ జియో-పోలిటికల్ వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రధాన ప్రత్యర్ధుల ‘ముసుగు యుద్ధానికి’ కేంద్రంగా రక్తం ఓడుతున్న సిరియా, నేటి సామ్రాజ్యవాద యుద్ధ క్షేత్రం. శాంతి విరామం లేని అనంత యుద్ధానికి బహిరంగంగానే నాందీ వాచకం పలికిన జార్జి డబ్ల్యూ బుష్, అమెరికా వాల్ స్ట్రీట్…

సిరియా భవిష్యత్తు నిర్ణయించడానికి వాళ్ళెవరు? -బషర్

సిరియా భవిష్యత్తు నిర్ణయించాల్సింది సిరియా ప్రజలు మాత్రమేనని ఆ దేశ అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ మరోసారి స్పష్టం చేశారు. సిరియా ప్రజల తరపున మాట్లాడడానికి జాన్ కెర్రీ ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. అర్జెంటీనా టి.వి చానెళ్ల విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చిన బషర్ అమెరికా-రష్యా ల శాంతి సమావేశం ప్రయత్నాలు ఫలిస్తే సంతోషమని, కానీ పశ్చిమ దేశాలకు శాంతి ప్రయత్నాలు సఫలం కావడం ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు. సిరియాలో కిరాయి తిరుగుబాటుదారులు ఎదురు దెబ్బలు తింటూ వరుస…

సిరియా సంక్షోభం: ప్రధానిని కలవడానికి ప్రత్యేక దూత రాక

ప్రపంచాధిపత్య రాజకీయాలలో భాగంగా ప్రేరేపించబడిన సిరియా కిరాయి తిరుగుబాటు ప్రతిష్టంభన ఎదుర్కొంటున్న నేపధ్యంలో సిరియా ప్రభుత్వం భారత దేశానికి ప్రత్యేక దూతను పంపుతోంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకుని సిరియా ఘర్షణల గురించి వివరించడానికి సిరియా అధ్యక్షుడు ‘బషర్ ఆల్-అస్సాద్’ అత్యున్నత సలహాదారు ‘బొతైన షాబాన’ భారత దేశం వస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు కోరుతున్నట్లుగా సిరియాలో బలవంతపు అధికార మార్పిడిని తిరస్కరిస్తున్నట్లు భారత ప్రభుత్వం అంతర్జాతీయ…

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల తదుపరి టార్గెట్ సిరియా

రెండు నెలల నుండి లిబియాపై బాంబుల వర్షం కురిపిస్తూ అక్కడి మౌలిక సౌకర్యాల నన్నింటినీ సర్వ నాశనం చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు సిరియాను తమ తదుపరి లక్ష్యంగా ఎన్నుకున్నాయి. సిరియా అధ్యక్షుడు అబ్దుల్ బషర్ ను గద్దె దించేందుకు ఐక్యరాజ్యసమితిలో పావులో కదుపుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు సిరియాపై సమితి చేత తీర్మానం చేయించడానికి ఒత్తిడి పెంచుతున్నాయి. లిబియా విషయంలో కూడా బ్రిటన్, ఫ్రాన్సు లు అక్కడి ప్రభుత్వం తమ ప్రజలపై నిర్బంధం ప్రయోగిస్తున్నదని మొదట…

సిరియా కాల్పులపై భద్రతాసమితి తీర్మానాన్ని వ్యతిరేస్తున్న ఇండియా, చైనా, రష్యాలు

నాలుగు రోజులనుండి సిరియా ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ఖండించడానికి భద్రతా సమితిలొ జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న ఆందోళనకారులపై సిరియా ప్రభుత్వం కాల్పులు జరుపుతున్నదనీ, వారితో చర్చలు జరిపేవిధంగా సిరియాపై ఒత్తిడి తేవడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సమితి తీర్మానాన్ని అడ్డు పెట్టుకుని పశ్చిమ దేశాలు ఎంతకైనా తెగిస్తాయన్న విషయం లిబియా అనుభవం ద్వారా స్పష్టం కావడంతో సిరియాపై తీర్మానాన్ని ఇండియా, చైనా, రష్యా ప్రభుత్వాలు గట్టిగా…