సామాన్యుడికి ఏమీ లేని బడ్జెట్ -కార్టూన్

“బహుశా సామాన్యుడికి ఎంతో కొంత జారిపడుతుందేమో…” *** మోడి-జైట్లీల బడ్జెట్ పై సునిశిత విమర్శ ఈ కార్టూన్! పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు ‘ట్రికిల్ డౌన్ ధియరీ” అని ఒక తలకు మాసిన సిద్ధాంతాన్ని చెబుతుంటారు. ఈ సిద్ధాంతం అంటే పెట్టుబడిదారీ కంపెనీలకు చెప్పలేనంత ఇష్టం. ఉన్నదంతా తమకే దోచి పెట్టమని చెప్పే సిద్ధాంతం వారికి ఎందుకు ఇష్టం ఉండదు. ఆర్ధిక పిరమిడ్ లో పైన ఉన్న కొద్ది మందికి బడ్జెట్ లో అధిక మొత్తాన్ని ఇచ్చేస్తే అది బొట్లు…

బడ్జెట్: జైట్లీ చదవని భారీ సంస్కరణలు

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తన నోటితో చదవని భారీ సంస్కరణలు బడ్జెట్ లో దండిగానే ఉన్నాయి. ఆంగ్లంలో బిగ్ టికెట్ రిఫార్మ్స్ గా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పిలిచే ఈ సంస్కరణలే బడ్జెట్ అసలు సారాంశం. జనం మెచ్చే కేటాయింపులు సభలో చదివి తక్షణం ప్రతిపక్షాలు, ప్రజల నుండి విమర్శలు ఎదురయ్యే ప్రతిపాదనలను చదవకుండా ఆర్ధికమంత్రి జాగ్రత్తపడ్డారు. తద్వారా పేదలది ఎంతమాత్రం కాని బడ్జెట్ ని “ఇది పేదల బడ్జెట్” అని ప్రధాని నిరభ్యంతరంగా ప్రకటించే…

సంస్కరణలే లక్ష్యంగా బడ్జెట్ 2014-15 -2

వ్యవసాయ రంగం భారత దేశంలో ఇప్పటికీ 60 శాతం ప్రజానీకానికి వ్యవసాయ రంగమే ఉపాధి ఇస్తోంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్, హోటళ్లు లాంటి సేవా రంగాలతో పాటు వ్యాపార రంగానికి, నిర్దిష్ట పారిశ్రామిక రంగాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఆదాయం ప్రధాన వనరుగా ఉపయోగపడుతుంది. అనగా వ్యవసాయరంగం కుంటుబడితే దాని ఫలితం బహుళవిధాలుగా ఆర్ధిక వ్యవస్ధపై పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఆదాయంపై ఆధారపడిన రంగాలన్నీ ప్రభావితమై అనేక రేట్లు ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై పడుతుంది.…

ఎన్నికల బడ్జెట్ -కార్టూన్

లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలనే బైపాస్ రోడ్లుగా వేసుకుంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం పదేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. విదేశీ మాస్టర్లు, స్వపార్టీ నాయకుల ఆదేశాలను కిమ్మనకుండా పాటించే హార్వర్డ్ మర మనిషి యు.పి.ఎ డ్రైవర్ గా తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించారు. ఇచ్చిన ఆదేశాలను పొల్లుపోకుండా ఎంత ఖచ్చితంగా అమలు చేస్తే మర మనిషి అంత సమర్ధవంతంగా పని చేసినట్లన్నది లోకోక్తిగా మార్చడంలోనూ మన మరమనిషి సఫలం అయ్యారు. ఇక చివరి బడ్జెట్…