పార్లమెంటుకి భారీ ముప్పు -కార్టూన్

రానున్న పార్లమెంటు సమావేశాలకు మరో భారీ ముప్పు పొంచి ఉంది. బడ్జెట్ సెషన్ రెండు విడత సమావేశాలను 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం మరోసారి ముంచెత్తనుంది. కుంభకోణంపై చాసో నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటు కమిటీ (జె.పి.సి) తన నివేదిక ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టనుండడమే ఆ ముప్పు. అదీ కాక మిత్రుల దూరంతో బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవడం కాంగ్రెస్ కు కష్టం కావచ్చు. అందుకోసం కొన్ని లొంగుబాట్లు అవసరం పడవచ్చు. స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని తప్పేమీ లేదని,…

మహిళా బ్యాంకు బ్రాంచీలు ఆరు

– 2013-14 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రతిపాదించిన మహిళా బ్యాంకుల స్వరూపం మెల్లగా రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహిళా బ్యాంకు విధి, విధానాలు రూపొందించడానికి వివిధ బ్యాంకర్లు, ఇతర నిపుణులతో ఒక కమిటీ నియమిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి శుక్రవారం ప్రకటించాడు. జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ చేసిన సూచన మేరకే తాను బడ్జెట్ లో మహిళా బ్యాంకు స్థాపించనున్నట్లు ప్రకటించానని…

బడ్జెట్ 2013-14: వేతన జీవులకు 2000/- ముష్టి

ఆర్ధిక మంత్రి చిదంబరం 2013-14 బడ్జెట్ లో సాధారణ పన్ను చెల్లింపుదారులకు కాసింత ముష్టి విదిలించి మధ్య తరగతి ప్రజల పట్ల తనకు ఉన్న ఔదార్యం చాటుకున్నాడు. సంవత్సరానికి రు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రు. 2,000/- పన్ను చెల్లింపులో మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంటే మొదటి పన్ను శ్లాబ్ ను రు. 2 లక్షల నుండి 2.2 లక్షలకు పెంచినట్లు అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఇది పరిమితి పెంపు కాదు. ప్రభుత్వమే ఆయా…

బడ్జెట్ 2013-14: సబ్సిడీల్లో భారీ కోత

2013-14 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వం సబ్సిడీలలో భారీ కోతలు ప్రతిపాదించింది. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి చిదంబరం ఈ కోతల గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా దాచిపెట్టాడు. నిజానికి సబ్సిడీలను తగ్గించవలసిన అవసరం గురించి ప్రధాని, ఆర్ధిక మంత్రి, ప్రధాని ఆర్ధిక సలహా బృందం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తదితరులంతా వీలు దొరికినప్పుడల్లా బోధనలు, సలహాలు, హెచ్చరికలు చేస్తూ వచ్చారు. వాటిని అమలు చేసే సమయంలో మాత్రం…

బడ్జెట్ 2013-14: మాటలు సామాన్యుడికి, మూటలు కార్పొరేట్లకు

చిదంబరం బడ్జెట్ చిదంబర రహస్యాలతో నిండిపోయింది. ఆదర్శాలు వల్లించడానికే తప్ప ఆచరించడానికి కాదని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మాటలు సామాన్యుడికి మూటలు కార్పొరేట్లకు పంచి పెట్టింది. దొడ్డి దారిలో మూటల్ని దాటించి, సింహద్వారంలో ఆదర్శాల మాటలు వేలాడగట్టింది. ఆహార భద్రత చట్టం గురించి ఘనంగా చెప్పుకుని అందుకోసం ముష్టి 10 వేల కోట్లు విదిలించింది. దేశ ప్రజలకు పూర్తిస్థాయి ఆహార భద్రత కల్పించాలంటే 84,000 కోట్లు అవసరమని చెప్పిన తన మాటలు తానే ఉల్లంఘించింది.…