నెమ్మదిగా పురోగమిస్తున్న బ్రిక్స్ బ్యాంక్
సెప్టెంబర్ 9, 2021 తేదీన భారత దేశం నేతృత్వంలో (Chairship) 13వ బ్రిక్స్ సమావేశాలు ఆన్-లైన్ పద్ధతిలో జరిగాయి. మిగతా నాలుగు దేశాల నేతలు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొని చర్చలు జరిపారు. “బ్రిక్స్ సభ్య దేశాల అంతర్గత సహకారం కొనసాగింపు, స్ధిరీకరణ, ఏకాభిప్రాయం” అనే అంశం కేంద్రంగా ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశం నాటికి బ్రిక్స్ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తవడం విశేషం. మూడు మూల స్తంభాల ప్రాతిపదికన బ్రిక్స్ దేశాల మధ్య సహకారం…