టీం అన్నా సభ్యుడిపై ‘శ్రీరాం సేన’ దాడి, కాశ్మీరు సమస్యపై వ్యాఖ్యే కారణం

మత మూఢులకి పరమత సహనం ఎలాగూ ఉండదు. వారికి ప్రజాస్వామ్య భావాల పట్ల కూడా గౌరవం ఉండదు. తమ నమ్మకాలకు భిన్నమైన భావాలను సహించడాం వారి వల్ల కాదు. అది ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావొచ్చు, లేదా క్రిస్టియన్ మతం కావొచ్చు. అందుకు తార్కాణంగా సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు ప్రాంగణంలోనే బుధవారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్…