నిరుద్యోగంలో వివిధ రకాలు -ఈనాడు

భారత దేశ జనాభా 120 కోట్ల పై మాటే. వారిలో నిరుద్యోగులు ఎంతమంది అని అడిగితే ప్రభుత్వాలు చెప్పే సమాధానం 4 కోట్లు అని. 120 కోట్ల మంది జనాభాలో నిరుద్యోగులు 4 కోట్ల మందేనా అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఈ సంఖ్య కేవలం చదువుకున్న వారికి మాత్రమే సంబంధించింది అని మనకు వెంటనే కనపడదు. చదువుకున్న వారిలో కూడా ఎవరైతే ఉద్యోగం కావాలని ఎంప్లాయ్ మెంట్ ఎక్ఛెంజీలో రిజిస్టర్ చేసుకున్నారో వారిని మాత్రమే…