రాఫెలే ఫైటర్: ఫ్రాన్స్ తో ఒప్పందం ఖరారు!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
36 రాఫెలే ఫైటర్ జెట్ లను కొనుగోలు చేసేందుకు శుక్రవారం ఫ్రాన్స్ తో ఇండియా ఒప్పందం ఖరారు చేసుకుంది. యూ‌పి‌ఏ హయాంలోనే కుదిరిన ఈ ఒప్పందాన్ని మోడి ప్రభుత్వం ఖరారు చేసింది. 7.87 బిలియన్ యూరోలు చెల్లించి 36 రాఫెలే ఫైటర్ జెట్ యుద్ధ విమానాలని ఇండియా కొనుగోలు చేస్తుంది. మన కరెన్సీలో ఇది రమారమి 58.94 వేల కోట్లకు రూపాయలకు సమానం. రాఫెలే జెట్, MMRCA తరహా యుద్ధ విమానం. అనగా…

సంక్షోభ ఫలితం, ఫ్రెంచి ప్రభుత్వం రద్దు

ఫ్రాన్స్ లో నెలకొన్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు అక్కడి ప్రభుత్వాన్ని బలి తీసుకున్నాయి. ఫ్రెంచి ప్రభుత్వం అనుసరిస్తున్న ‘పొదుపు విధానాలు’ వినాశకరంగా పరిణమించాయని అక్కడి ఆర్ధిక మంత్రి ఆర్నాడ్ మాంటెబోర్గ్ బహిరంగంగా విమర్శించిన మరుసటి దినమే ప్రభుత్వం రద్దు చేసుకుంటామని ప్రధాని మాన్యువెల్ వాల్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండేకు విన్నవించాడు. ప్రధాని విన్నపాన్ని ఆమోదించిన అధ్యక్షుడు ఒలాండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అదే ప్రధానిని కోరారు. ఫ్రాన్స్ ఆర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం ఆర్ధిక వృద్ధి…

ఇరాక్, సిరియాల్లో 900 మంది ఫ్రెంచి జిహాదీలు

మధ్య ప్రాచ్యంను కుదిపేస్తున్న ఇస్లామిక్ ఘర్షణల్లో పశ్చిమ దేశాల పౌరులు పాల్గొనడం నానాటికీ పెరుగుతోంది. సిరియాలో పశ్చిమ దేశాలు ప్రేరేపించిన కిరాయి తిరుగుబాటు మొదలైనప్పటి నుండి అనేక ఇస్లామిక్ దేశాల నుండి ఆకర్షించబడిన అమాయక యువత సిరియాకు ప్రయాణం కట్టారు. సో కాల్డ్ జిహాద్ లో పాల్గొనడానికి పశ్చిమ దేశాల నుండి కూడా ముస్లిం యువత ఇరాక్, సిరియాలకు వెళ్ళడం పెరిగిపోయిందని ఆ దేశాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. ‘ఇస్లామిక్ స్టేట్’ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్…

రికార్డు స్ధాయికి ఫ్రాన్స్ నిరుద్యోగం

ఐరోపాలో జర్మనీ తర్వాత హెవీ వెయిట్ గా పేరు పొందిన ఫ్రాన్స్ లో కూడా ప్రజలు నిరుద్యోగ భూతాన్ని ఎదుర్కొంటున్నారు. గత 15 సంవత్సరాలలోనే అత్యధిక స్ధాయికి అక్కడి నిరుద్యోగం చేరుకుంది. 2013 మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) ముగిసేనాటికి ఫ్రాన్స్ లో 10.8 శాతం నిరుద్యోగం నమోదయిందని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్ధ INSEE గురువారం తెలిపింది. 1998 తర్వాత ఈ స్ధాయి నిరుద్యోగం నమోదు కావడం ఫ్రాన్స్ లో ఇదే మొదటిసారి.…

నిజమే నేను తప్పు చేశాను -ఫ్రాన్స్ విదేశీ మంత్రి మేరీ

“ట్యునీషియా వ్యాపారవేత్త సొంత విమానంలో ప్రయాణం చేయటం నా తప్పే” అంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఇప్పుడు లెంపలు వేసుకుంటోంది. ఓ పక్కన టునీషియా ప్రజలను రెండున్నర దళాబ్దాల పాటు నియంతలా పాలించిన అధ్యక్షుడు బెన్ ఆలీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తూ పోలీసుల చేతిలో అనేక మంది చనిపోతుండగా అతని సన్నిహితుడయిన వ్యాపారవేత్తకి చెందిన ప్రైవేటు విమానంలో విహారయాత్రకు ట్యునీషియా బయలుదేరి రావటంతో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఎలియట్ మేరీ ప్రపంచ…