ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యం ఉపసంహరణలో అమెరికాతో పాటే ఫ్రాన్సు కూడా

ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి సైన్యాన్ని మొదటి దశలో మూడువిడతలుగా 33,000 మంది సైనికులను ఉపసంహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ కూడా అమెరికాను అనుసరించనున్నట్లు ప్రకటించాడు. తమ సైనికుల్ని కూడా ఉపసంహరిస్తామని ప్రకటించింది. ఐతే, అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో సైనికులను ఆఫ్ఘనిస్ధాన్‌ దురాక్రమణకు పంపిన ఇంగ్లండు ఇంతవరకూ ఈ విషయమై ఏ ప్రకటనా చేయకపోవడం విశేషం. అమెరికా ఉపసంహరించునే సైనికుల సంఖ్యకు దామాషాలో తాము తమ…

గ్రీసు రేటింగ్ ను తగ్గించిన మూడీస్, కొనసాగుతున్న యూరప్ అప్పు సంక్షోభం

మూడీస్ రేటింగ్ సంస్ధ గ్రీకు సావరిన్ అప్పు రేటింగ్ ను మరోసారి తగ్గించింది. ఇప్పటివరకూ Ba1 రేటింగ్ ఉండగా దానిని B1కు తగ్గించింది. ట్రెజరీ బాండ్లు జారీ చేయడం ద్వారా దేశాల ప్రభుత్వాలు చేసే అప్పును సావరిన్ అప్పు అంటారు. సావరిన్ బాండ్లను ప్రభుత్వాలు వేలం వేస్తాయి. బాండ్లు జారీచేసే దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై బాండ్ల కొనుగోలుదారులకు (మదుపుదారులు) ఉన్న నమ్మకాన్ని బట్టి బాండ్లపై ప్రభుత్వాలు చెల్లించే వడ్డీ రేటు నిర్ణయమవుతుంది. ప్రభుత్వాలు బాండ్ల విలువ మొత్తాన్ని…